MR Bachchan: ప్రేయసిని తీసేసి.. భార్యను రీప్లేస్ చేసిన సెన్సార్ బోర్డు
MR Bachchan: మాస్ మహారాజా రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ ఈరోజు రిలీజ్ అయ్యింది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. హిందీలో రిలీజ్ అయిన రెయిడ్ సినిమాను తెలుగులో మిస్టర్ బచ్చన్‌గా నేటివిటీకి తగ్గట్టుగా తెరకెక్కించారు హరీష్. అయితే.. ఈ సినిమాలో రవితేజను బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ ఫ్యాన్‌గా చూపించే ప్రయత్నం చేసారు.
ఈ నేపథ్యంలో సెన్సార్ బోర్డు ఒక పోస్టర్ విషయంలో ముందే తగిన చర్యలు తీసుకుంది. లేదంటే ఈ సినిమాపై పెద్ద చర్చ జరిగి ఉండేది. అదేం పోస్టర్ అంటే.. సినిమాలో అమితాబ్ పక్కన ఆయన మాజీ ప్రేయసి రేఖ ఉన్న పోస్టర్‌ను చూపించారు. సినిమాను చూసిన సెన్సార్ బోర్డు రేఖ ఫోటో తీసేసి అమితాబ్ భార్య జయా బచ్చన్ ఫోటోతో రీప్లేస్ చేయాలని ఆదేశించారు. అలా అమితాబ్ పక్కన రేఖను తీసేసి జయ ఫోటోను పెట్టారు. ఒకవేళ అమితాబ్ రేఖ పోస్టర్‌ను అలాగే ఉంచి ఉంటే బాలీవుడ్ వాళ్లు టాలీవుడ్‌పై తెగ ట్రోలింగ్ చేసేవారు.