నీ కంటే ఎక్కువ నన్ను ఎవరు లవ్ చేస్తారు?
సమంత, నాగచైతన్యలు విడిపోయారంటే ఇప్పటికీ ఫ్యాన్స్‌కి షాకింగ్‌గానే ఉంది. ఎందరో అభిమానులు వారి జంటను ఆదర్శంగా తీసుకునేవారు. ఎప్పటికప్పుడు సామ్ తాను నాగచైతన్యతో ఎంతో సంతోషంగా ఉన్నానని, ప్రతిక్షణాన్ని ఆస్వాదిస్తున్నానని చెప్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతుండేవారు. 2021లో తమ వైవాహిక జీవితానికి స్వస్తిపలుకుతున్నాం అని సామ్, చై ప్రకటించడంతో అభిమానులతో పాటు సినీ ఇండస్ట్రీ కూడా షాక్‌కు గురైంది. ఇందుకు కారణాలు ఎవరికీ తెలీవు కానీ వారు మళ్లీ కలిస్తే బాగుంటుంది అని చాలా మంది ఆశపడుతున్నారు. ఈ నేపథ్యంలో సామ్ అభిమాని ఒకరు.. ఇలా అడగడం సరైనది కాదు అని తెలుసు. కానీ మీరు మళ్లీ ఎవరినైనా ప్రేమించవచ్చు కదా..! అని అడిగారు. ఇందుకు సామ్ స్పందిస్తూ.. నీకంటే ఎక్కువ నన్ను ఎవరు లవ్ చేస్తారు అని బదులిచ్చారు. ప్రస్తుతం సామ్.. శాకుంతలం సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. గుణశేఖర్ తెరకెక్కించిన ఈ సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ అవబోతోంది.