WhatsApp : ఒకటే నంబర్​.. నాలుగు ఫోన్లు!

Hyderabad: స్మార్ట్​ ఫోన్(Smart phone)​ యూజర్లకు అత్యంత ప్రియమైన యాప్​గా అవతరించింది వాట్సాప్(Whatsapp)​. ఇంతటి ఆదరణ పొందుతున్న వాట్సాప్​లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటుంది మాతృసంస్థ మెటా(Meta). ఇప్పుడు మరోక అదిరిపోయే ఫీచర్ ను లాంచ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కొత్త ఫీచర్ లో వినియోగదారులు వాట్సాప్ ను ఒక్క ఫోన్ లో మాత్రమే కాకుండా నాలుగు ఫోన్లలో వాడేలా సరికొత్త సదుపాయాన్ని తీసుకొస్తున్నట్లు అధికారిక కంపెనీ బ్లాగ్ పోస్ట్ లో వెల్లడించింది.

ఈ ఫీచర్ ద్వారా ఫోన్ డ్యామేజ్ లేదా బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయిన సమయాల్లో  మరొక ఫోన్​లో స్కానర్ ద్వారా లాగిన్ అయి వాట్సాప్ ఉపయోగించవచ్చు. గరిష్టంగా నాలుగు ఫోన్ లను ఒకే వాట్సాప్ నంబర్ తో లింక్ చేయవచ్చు. గతంలో ఈ ఫీచర్స్ కు సంబంధించి పలు వార్తలు వచ్చినప్పటికి, కంపెనీ మొట్టమొదటి సారిగా దాని బ్లాగ్ పోస్ట్ లో పేర్కొంది. మొదటి పోన్ లో వాట్సాప్ ను ఓపెన్ చేసి స్కానర్ సహాయంతో వేరే స్మార్ట్ ఫోన్ లోని క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా నాలుగు అదనపు స్మార్ట్ ఫోన్ లను ఇలా లింక్ చేయేచ్చు. దీని ద్వారా మొదటి ఫోన్ పనిచేయని టైంలో సెకండరీ ఫోన్ ద్వారా ఇతరుతో తమ మెసేజ్ లను తిరిగి పంపవచ్చు, పొందవచ్చు. ఫోటోలు, మీడియా ఫైల్స్ ను కూడా యాక్సిస్ చేయవచ్చు. సెకండరీ ఫోన్ లో వాట్సాప్ లాగిన్ కొద్ది రోజుల వరకు ఉంటుంది. దీంతో వినియోగదారులు వేరే స్మార్ట్ ఫోన్ లలో లాగ్ అవుట్ అవడం మార్చిపోయినా కూడా ఈ ఫీచర్ తో అదే లాగ్ అవుట్ అయిపోతుంది. నాలుగు ఫోన్​లలో వాట్సాప్​ వాడినా మొదటిదే ప్రధాన ఫోన్​గా ఉంటుంది. సెట్టింగ్స్​ అన్నీ దాని నుంచే మార్చడానికి వీలవుతుంది.  అదిరిపోయింది కదూ.. కొత్త ఫీచర్​!