Bharat Mandapam ప్ర‌త్యేక‌త‌లు ఇవే..!

దేశ రాజ‌ధాని ఢిల్లీలో జీ20 స‌ద‌స్సు (g20 summit) ఈరోజు నుంచే ప్రారంభం అయింది. దేశాధినేత‌లు ఈ స‌ద‌స్సులో పాల్గొననున్నారు. ఈ స‌ద‌స్సుకు ఢిల్లీలోని రాజ‌ఘాట్ రోడ్డులో ఉన్న భార‌త మండ‌పం (bharat mandapam) వేదిక కానుంది. అస‌లు ఏంటీ భార‌త మండ‌పం? దీనిలో ఉన్న ప్రత్యేక‌త‌లు ఏంటి?

*2023 జులై 26న ఈ భార‌త మండ‌పాన్ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్రారంభించారు. ప్ర‌త్యేక స‌మావేశాలు, కాన్ఫ‌రెన్స్‌లు ఇక్క‌డ నిర్వ‌హించేందుకు భార‌తీయ‌త ఉట్టిప‌డేలా దీనిని నిర్మించారు.

*ఈ భార‌త మండ‌పాన్ని నిర్మించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ఏకంగా రూ.2700 కోట్లు ఖ‌ర్చు చేసింది. (bharat mandapam)

*123 ఎక‌రాల్లో దీనిని నిర్మించారు. దీనిని IECC కాంప్లెక్స్ అంటారు. భార‌త‌దేశంలోనే అతిపెద్ద స‌ద‌స్సులు నిర్వ‌హించే కాంప్లెక్స్‌గా పేరుగాంచింది.

*ఈ మండ‌పంలో డ‌జ‌న్ల కొద్ది మీటింగ్ గ‌దులు, లోంజెస్, ఆడిటోరియంలు, బిజినెస్ సెంటర్లు ఉన్నాయి. 3000 మంది కూర్చుని వీక్షించేందుకు అతిపెద్ద ఆంఫీథియేట‌ర్ కూడా ఉంది.

*శంఖం ఆకారంలో దీనిని నిర్మించారు. భార‌తీయ సంప్ర‌దాయాలు, సంస్కృతి ఉట్టిప‌డేలా ఈ మండ‌పంలో ఎన్నో విగ్ర‌హాలు, డిజైన్లు ఉన్నాయి. (bharat mandapam)

*మండ‌పం మొత్తం 5జీ వైఫై ఉంటుంది. 10జీ ఇన్‌ట్రానెట్ క‌నెక్టివిటీ కూడా ఉంది.

*ఈ భార‌త మండపంలో ఉన్న ఇంట‌ర్‌ప్రెట‌ర్ ఉన్న‌తమైన టెక్నాల‌జీని ఉప‌యోగించి రూపొందించారు. దాదాపు 16 భాష‌ల‌ను ఈ టెక్నాల‌జీ స‌పోర్ట్ చేస్తుంది. విజిట‌ర్ల కోసం ఈ మండ‌పంలో 5,500 వాహ‌నాలు స‌రిపోయేంత పార్కింగ్ స్పేస్ కూడా క‌ల్పించారు. (bharat mandapam)