vizag steel plant: కేసీఆర్‌ బిడ్‌లో పాల్గొంటారా? లేదా?

vijayawada: వైజాగ్‌ ఉక్కు(vizag steel plant) పరిశ్రమకు ముడి సరకు అందజేయడం… లేదా.. స్టీల్‌ కొనుగోలుకు ఆసక్తి చూపే వారు ఈ నెల 15వ తేదీలోగా బిడ్‌ దాఖలు చేయాలని దీనికి సంబంధించిన ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ (eoa) దాఖలు చేయాలని ఆ సంస్థ గత నెల 27న కోరింది. అయితే.. దీనికి ఏపీ ప్రభుత్వం(ap govt) ఆసక్తి చూపించలేదు. కానీ కేసీఆర్‌(cm kcr) మాత్రం ఈవోఏ దాఖలు చేయడం వల్ల వచ్చే లబ్ది గురించి నివేదిక అందజేయాలని.. సింగరేణి కాలరీస్‌ అధికారుల అయిదుగురు సభ్యుల బృందాన్ని విశాఖకు పంపారు. వారు తాజాగా కేసీఆర్‌కు ఓ నివేదక(report) రూపొందించి.. ముడి సరకు కొనుగోలు చేయడంపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. అయితే.. మరి కేసీఆర్‌ ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నదానిపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. ముందు నుంచే ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపకుండా కేసీఆర్‌ అడ్డుకుంటారని చెప్పుకుంటూ వస్తున్నారు బీఆర్‌ఎస్‌(brs) నాయకులు.

కేసీఆర్‌ నియమించిన సింగరేణి బృందం రెండురోజుల పాటు వైజాగ్‌ స్టీల్‌ పరిశ్రమలో కలియతిరిగి.. అక్కడి అధికారులతో చర్చించి పలు వివరాలు సేకరించారు. వైజాగ్‌ ఉక్కు పరిశ్రమకు నిధులు సమకూరిస్తే లాభాలు గడించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఈమేరకు నివేదికను సీఎం కేసీఆర్‌కు అందించారు. ఇక తెలంగాణ సింగరేణి గనుల్లో స్టీల్‌ తయారీకి ఉపయోగపడే.. కోకింగ్‌ కోల్‌ లేనందున.. స్టీల్‌ ప్లాంట్‌ బిడ్డింగ్‌లో పాల్గొనే అవకాశం సింగరేణికి లేదు. మూలధనం కింద నేరుగా నిధులు అందించే వెసులుబాటు కూడా సింగరేణికి లేనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వమే బిడ్‌ దాఖలు చేయాలని సింగరేణి కోరుతోంది. తెలంగాణలో ప్రభుత్వం చేపట్టే వివిధ కార్యక్రమాలు, పథకాల కోసం ఏటా 3 లక్షల టన్నుల స్టీల్ అవసరమని ప్రభుత్వ వర్గాలు గుర్తించాయి. దీన్ని వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ నుంచి నేరుగా కొనుగోలు చేస్తే ప్రభుత్వానికి ఎంతో లాభం కలుగుతుందని భావిస్తున్నారు.