viveka murder case: అవినాష్ రెడ్డి అరెస్టుపై కడపలో బెట్టింగ్‌లు!
vijayawada: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు(viveka murder case)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి(mp avinash reddy)ని అరెస్టు చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. ఈక్రమంలో కడపలో బెట్టింగు(bettings on avinash arrest in kadapa)లు జరుగుతున్నాయని టాక్. కొందరు అరెస్టు అవుతారని బెట్టింగ్ వేస్తుండగా… మరి కొందరు అవినాష్ బయటే ఉంటారు అని జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయని సమాచారం. ఇప్పటికే అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి(bhaskar reddy)ని సీబీఐ(cbi) అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో అవినాష్‌ను కూడా.. సీబీఐ అధికారులు విచారణకు రావాలని ఆదేశాలు ఇచ్చిన తరుణంలో ఆయన తెలంగాణ హైకోర్టు(telangana high court)లో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. దీనిని సవాలు చేస్తూ.. వివేకా కుమార్తె సునీత(sunitha) సుప్రీం కోర్టు(suprem court)ను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. అవినాష్‌ను అరెస్టు చేయవద్దనడాన్ని ఖండించింది. సీబీఐ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వకపోతే.. కేసు దర్యాప్తు ఏవిధంగా ముందకు సాగుతుందని తెలంగాణ హైకోర్టును ప్రశ్నించింది.
హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న వ్యక్తి నుంచి లిఖిత రూపంలో ప్రశ్నల జాబితాను ముందుగానే అప్పగించాలన్న తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టిస్ చంద్రచూడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్యాప్తు సంస్థలు ఏవిధంగా ప్రశ్నలు అడగాలో నిందితులు కోరితే.. ఇక సీబీఐ పనిచేయడం ఎందుకు? మూసి వేయాలని అసహనం వ్యక్తం చేశారాయన. ఇప్పటికే కోర్టు ఆదేశాలతో సీబీఐ అధికారులు కేసుపై సరిగా ఫోకస్ చేయలేకపోయినందున.. దర్యాప్తు గడువును మరో రెండు నెలలకు పెంచుతూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హత్యకు సూత్రధారులుగా భావిస్తున్న వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్‌కుమార్ రెడ్డిలను సీబీఐ ఇటీవల అరెస్టు చేసి విచారణ పూర్తి చేసింది. ఈ కేసు విచారణ మరో రెండు నెలలు కొనసాగనుండగా.. కేసుకు సంబంధించి కొత్త వ్యక్తులు వెలుగులోకి వచ్చే అవకాశం కూడా ఉంది.