viveka murder case: రెండు మూడు రోజుల్లో అవినాష్ రెడ్డి అరెస్టు.. కారణం ఇదే!
hyderabad: వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (ys viveka murder Case) కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (mp avinash reddy) తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ (Anticipatary Bail ) కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో (ts High Court) రెండో రోజు విచారణ కొనసాగింది. ఈ సందర్బంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు పరిధిలో ఉన్న ఈ కేసుపై తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని చెప్పారు. సీబీఐ విచారణ చేసుకోవచ్చని సూచించింది. దీంతో అవినాష్ రెడ్డిని రెండు మూడు రోజుల్లో అరెస్టు చేస్తారని సమాచారం. ఇది ఇలా ఉండగా.. ఇవాళ ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి.. ముందస్తు బెయిల్‌పై ఒక్కరోజులో నిర్ణయం తీసుకోలేమన్నారు. రేపటి నుంచి సమ్మర్ హాలిడేస్ ఉండటంతో.. వెకేషన్ తర్వాత బెయిల్ రద్దుపై తీర్పు ఇస్తామని ధర్మాసనం తెలిపింది. అంటే జూన్ 5వ తేదీ మరోసారి అవినాష్ కేసు విచారణ చేపడతామని స్పష్టం చేశారు.
అవినాష్ తరపు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ మధ్యాహ్నం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా అవినాష్ తరపు న్యాయవాదులు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. సీబీఐ అరెస్టు చేయకుండా విచారించేలా తీర్పు ఇవ్వాలని అడిగారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. సుప్రీం పరిధిలోకి బెయిల్ పిటిషన్ వెళ్లిందని.. వారు తీర్పు ఇచ్చిన తర్వాత హైకోర్టులో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం కుదరదని చెప్పారు. ఈక్రమంలో అవినాష్ తరపు న్యాయవాదులు సీజేఐ బెంచ్ వద్ద కూడా తమ వాదనలను వినిపించారు. వారు కూడా వెంటనే తీర్పు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. చివరికి కనీసం రెండు వారాలైనా అవినాష్‌ను సీబీఐ అరెస్టు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరినా.. దానికీ కోర్టు అంగీకరించకపోవడం గమనార్హం. మరోవైపు ఇప్పటికే పులివెందులలో సీబీఐ అధికారులు మకాం వేసినట్లు సమాచారం. ఇక ఏ క్షణమైనా ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తారని పలువురు చెబుతున్నారు.