షర్మిల కామెంట్స్.. అవినాష్‌ రెడ్డి కౌంట‌ర్

vijayawada: వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు(viveka murder case) విచారణకు సంబంధించి.. వైఎస్సార్‌ టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల(ys sharmila) బుధవారం స్పందించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్‌ రెడ్డి(mp avinash reddy) తొలి నుంచి వివేకా కుటుంబంలో ఆస్తుల గొడవలు ఉన్నాయని .. ఆయనకు అనేకమంది మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని చెబుతూ వస్తున్నారు. వివేకా హత్యకు కారణం సునీత(sunitha) భర్త రాజశేఖర్‌ రెడ్డి(rajashekar reddy) అని పరోక్షంగా అవినాష్‌ రెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితి. ఈక్రమంలో వైఎస్‌ షర్మిల ఈ విషయాలపై మీడియాతో మాట్లాడారు. తన చిన్నాన్న వివేకానంద రెడ్డి ఆస్తి మొత్తం సునీతమ్మ పేరుమీద ఎప్పుడో రాశారని చెప్పడం సంచలనంగా మారింది. భౌతికంగా లేని తన చిన్నాన్న గురించి, క్యారెక్టర్‌పై మీడియాలో వస్తున్న వార్తలు చూస్తుంటే.. మీడియా సంస్థలు ఎంతగా దిగజారిపోయాయో తెలుస్తోందని అన్నారు.

ఇక షర్మిల నిన్న వివేకా హత్య గురించి సంచలన విషయాలు బయట పెట్టడం.. అవి కూడా ఎంపీ అవినాష్‌ రెడ్డి చేస్తున్న ఆరోపణలకు పరోక్షంగా కౌంటర్‌ ఇచ్చినట్లుగా ఉన్నాయి. దీంతో ఇవాళ ఎంపీ అవినాష్‌ రెడ్డి.. వివేకా హత్య జరిగిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు, సీబీఐ విచారణ, హత్యలో సునీత, ఆమె భర్త పాత్ర వంటి అంశాలను ప్రస్తావించారు. సీబీఐ విచారణ తీరు రాజకీయ కోణంలో జరుగుతోందని.. దర్యాప్తు అధికారి రాంసింగ్‌పై అవినాష్‌పై ఆరోపణలు చేశారు. హత్య జరిగిన ప్రాంతంలో సునీత, ఆమె భర్త రాజశేఖర్ కలిసి వివేకా చనిపోయే ముందు రాసిన లెటర్‌, అతని సెల్‌ఫోన్‌ను దాచే ప్రయత్నం చేశారని.. పోలీసులకు చాలా ఆలస్యంగా ఇచ్చారని అన్నారు. లెటర్‌ దాచిన విషయం గురించి సీబీఐ అధికారులు పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. సునీత, చంద్రబాబు, ఎల్లో మీడియా కలిసి.. తనపై కుట్ర పన్నుతున్నారని అవినాష్‌ ఆరోపించారు. అయితే.. షర్మిల వ్యాఖ్యల తర్వాత అవినాష్‌ వీడియో విడుదల చేయడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది.