Virat Kohli: 70 కాదు 120 శాతం కృషితో వ‌స్తా

Virat Kohli says he comes prepared with 120 percent

Virat Kohli: క్రికెట్ మైదానంలో విరాట్ కోహ్లీ అన‌గానే ఆవేశం అత‌ని ఎన‌ర్జీ గుర్తుకు వ‌స్తాయి. విరాట్ ఎనర్జీనే త‌న ఆట‌తో పాటు టీంలోని ఇత‌ర ఆట‌గాళ్ల‌ను కూడా బూస్ట్ చేస్తుంది. ఒక‌వేళ టీం ఇబ్బందులు ప‌డుతున్నా కూడా కోహ్లీ అంతే ఆవేశంతో కాన్ఫిడెంట్‌గా ఉంటాడు. ఆ త‌ర్వాత టీంను త‌న కృషితో న‌డిపిస్తాడు. ఒత్తిడి ఎక్కువ‌గా ఉన్న సంద‌ర్భాల్లో కోహ్లీ పాజిటివ్‌గానే ఆలోచిస్తాడు.

కీల‌క మ్యాచ్‌ల‌లో త‌న ఆట‌తీరుతో అద‌ర‌గొడ‌తాడు. గ‌త ప‌దేళ్ల‌లో మూడు ఫార్మాట్ల‌లో (టెస్ట్, ODI, T20) కోహ్లీ కీల‌క ఆట‌గాడిగా పేరొందాడు. త‌న స‌క్సెస్ వెన‌కున్న కార‌ణం డిసిప్లైన్, రొటీన్ ప్రాక్టీస్ అని తెలిపాడు. రోజూ చేసే ప‌నుల‌ను రొటీన్‌గా మార్చుకుని చేస్తుంటే ఎవ‌రినైనా స‌క్సెస్ వ‌రిస్తుంద‌ని అంటున్నాడు. త‌న రొటీన్ డిసిప్లైన్ వ‌ల్లే మైదానంలో 75% కృషితో కాకుండా 120 శాతం కృషితో అడుగుపెడ‌తాన‌ని అంటున్నాడు. ఇక కోహ్లీ నిన్న‌నే టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్ కోసం అమెరికా వెళ్లాడు. జూన్ 5న ఇండియా తొలి మ్యాచ్‌ను ఐర్లాండ్‌తో ఆడ‌నుంది.