IND vs SL Series: వెళ్లిపోయిన లంక బ్యాట‌ర్.. ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుకున్న రోహిత్ కోహ్లీ

virat and rohit cant stop their laugh after liyanage walks out of field

IND vs SL Series:  శ్రీలంక ఇండియా మ‌ధ్య జ‌రుగుతున్న సిరీస్‌లో ఈరోజు ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటుచేసుకుంది. టాస్ గెలిచిన శ్రీలంక‌ బ్యాటింగ్ ఎంచుకుంది. 35వ ఓవ‌ర్‌లో అక్ష‌ర్ ప‌టేల్ వేసిన బంతికి బ్యాట‌ర్ జ‌నిత్ లియానగే ఔట‌య్యాడు. ఆ బాల్‌ను రోహిత్ శ‌ర్మ పట్టుకున్నాడు.  ఔట్ అని టీమిండియా అపీల్ చేసింది కానీ అంపైర్ నాటౌట్ అని చెప్పాడు.

అయితే తాను నిజంగానే ఔట‌య్యాన‌నుకుని లియాన‌గే ఫీల్డ్ నుంచి వెళ్లిపోయాడు. రీప్లేలో లియాన‌గే నాటౌట్ అని చూపిస్తున్నా అత‌ను చూసుకోకుండా ఫీల్డ్ నుంచి వెళ్లిపోతుంటే అంపైర్ ఏమీ చేయ‌లేక ఔట్ అని వేలు చూపించాడు. ఆ స‌మ‌యంలో రీప్లే చూసిన రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ ఔట్ అవ్వ‌క‌పోయినా చూసుకోకుండా వెళ్లిపోయిన లియాన‌గేని చూసి ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుకున్నారు. కోహ్లీ, రోహిత్ తొమ్మిది నెల‌ల త‌ర్వాత తొలి ODI మ్యాచ్ ఇది.