Viral News: ఓకే కాన్పులో ఐదుగురు పిల్లలు!

Ranchi: ఒకే కాన్పులో ఐదుగురు పిల్లలు జన్మించిన అరుదైన ఘటన జార్ఖండ్​(Jharkhand) రాజధాని రాంచీలో జరిగింది. ఒకే కాన్పులో ఐదుగురు పిల్లలు జన్మించడాన్ని క్వింటాప్లెట్స్(quintuplets) అని పిలుస్తారు. ఇది అరుదుగా జరుగుతుంది. దాదాపు 55,000,000 జననాలలో ఒక క్వింటాప్లెట్స్​ నమోదవుతుందని చెబుతున్నారు డాక్టర్లు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పోలిష్-బ్రిటీష్ దంపతులు కూడా ఒకే కాన్పులో ఏడుగురు పిల్లలకు జన్మనిచ్చారు.

రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (RIMS) ఆస్పత్రిలో సోమవారం ఓ మహిళ ఐదుగురు శిశువులకు జన్మనిచ్చింది. అంతేకాదు ఆ మహిళకు సాధారణ ప్రసవం జరిగింది. ఈ కాన్పులో జన్మించినవారంతా బాలికలేనని రిమ్స్​ వైద్యులు ట్విట్టర్‌(Twitter)లో తెలిపారు. సాధారణం కంటే తక్కువ బరువుతో పుట్టినందున నియోనాటల్‌ ఐసీయూలో వారిని సంరక్షించినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఛత్రా జిల్లాలోని ఇత్కోరీకి చెందిన ఆ మహిళకు రిమ్స్‌ వైద్యుడు శశిబాలసింగ్‌ నేతృత్వంలోని వైద్యుల బృందం సాధారణ ప్రసవం చేసింది. ప్రస్తుతం తల్లి పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్​గా మారింది.