Kushi : సాంగ్​ ప్రోమో రిలీజ్​.. సమంత పాత్రేంటో తెలుసా?

Hyderabad: రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) కలిసి నటిస్తున్న సినిమా ‘ఖుషి’(Kushi). శివ నిర్వాణ(Shiva Nirvana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్​ శరవేగంగా కొనసాగుతోంది. సమంత అనారోగ్యంతో ఆలస్యమైన ఈ సినిమా సెప్టెంబర్​ 1న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్రబృందం ప్రమోషన్స్​ మొదలు పెట్టింది.

ప్రమోషన్స్​ భాగంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగల్ ని మే 9న రిలీజ్ చేయబోతున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా  ‘నా రోజా నువ్వే..’ అంటూ సాగే సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు. కాశ్మీర్ లోయల్లో ఈ సాంగ్ చిత్రీకరణ జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రోమోలోనే సమంత పాత్రని రివీల్ చేశారు. ప్రోమోలో సమంత నమాజ్ చేస్తూ కనిపిస్తుంది. దీంతో ఈ సినిమాలో సమంత ముస్లిం యువతిగా కనిపించబోతుందా? అని నెట్టింట ప్రశ్నల వర్షం కురుస్తోంది. మరి అసలు విషయం తెలియాలంటే సినిమా రిలీజ్​ అయ్యేవరకు ఆగాల్సిందే.

ఈ సినిమాకి మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతోంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ లాంగ్వేజ్స్ లో కూడా ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్(Mytri Movie Makers) ఈ సినిమాని నిర్మిస్తున్నారు.