ఇన్​స్టాలో రికార్డు కొట్టేసిన రౌడీ హీరో!

టాలీవుడ్​ యంగ్​ హీరో విజయ్​ దేవరకొండ క్రేజ్​ గురించి తెలిసిందే. విజయ్​ ఏం చేసినా, ఏం మాట్లాడినా సెన్సేషన్​గానే ఉంటుంది. విజయ్​కి ఉండే యూత్​ ఫాలోయింగ్​ అంతా ఇంతా కాదు. సోషల్​ మీడియాలోనూ విజయ్​ క్రేజ్​ మామూలుగా ఉండదు. ఏ పోస్ట్​ పెట్టినా క్షణాల్లో వైరల్​గా మారుతుంది. అమ్మాయిలైతే విజయ్​ అంటే మరీ ఇష్టపడతారు. అందుకే సోషల్​ మీడియా ఫాలోవర్స్ సంఖ్య​లోనూ రికార్డులు కొట్టేస్తున్నాడు ఈ రౌడీ హీరో. తాజాగా ఇన్​స్టాగ్రామ్​లో 18 మిలియన్​ ఫాలోవర్స్​ని దక్కుంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు.
పెళ్లి చూపులు సినిమాతో క్లాస్​ హీరోగా మార్కులు కొట్టేసి అర్జున్​ రెడ్డితో యూత్​ని ఉర్రూతలూగించాడు రౌడీ హీరో విజయ్​ దేవరకొండ. టాలీవుడ్​ రౌడీ స్టార్​ విజయ్​కి సినిమాల్లోనే కాదు సోషల్​ మీడియాలోనూ విపరీతమైన క్రేజ్​ ఉంది.
తాజాగా తన సోషల్ ప్లాట్‌ఫాంలో విజయ్ దేవరకొండ సరికొత్త మైలురాయికి చేరుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్ దేవరకొండను ఏకంగా 18 మిలియన్ ఫాలోవర్స్ ఫాలో చేస్తున్నారు. స్టార్ హీరోలకున్న క్రేజ్‌ను విజయ్ దేవరకొండ అలవోకగా అందుకోవడంతో ఇప్పుడు ఇది టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇక విజయ్ ఫాలోవర్స్ కూడా ఆయన సినిమాలతో పాటు సోషల్ మీడియా స్టఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటారు.
పూరీ జగన్నాథ్​ దర్శకత్వంలో రూపొందిన లైగర్​తో భారీ అపజయాన్ని మూటగట్టుకున్న విజయ్​ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఖుషి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో సమంత విజయ్​కి జోడీగా నటిస్తుండటంతో భారీ అంచనాలే ఉన్నాయి. అభిమానులూ వీరిద్దరిని తెరపై ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సింది. కానీ సమంత అనారోగ్యం కారణంగా షూటింగ్​ వాయిదా పడుతూ వచ్చింది. మార్చిలోనే సమంత మళ్లీ సెట్స్​లోకి అడుగు పెట్టినట్టు, షూటింగ్​ జోరుగా సాగుతున్నట్టు తెలిపింది చిత్రబృందం. ఈ మధ్యనే రిలీజ్​ డేట్​ని ప్రకటిస్తూ పోస్టర్​ని విడుదల చేశారు. సెప్టెంబర్​ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక, సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం ఏప్రిల్​ 14న విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. గుణశేఖర్​ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమా ప్రమోషన్స్​ జోరుగా కొనసాగుతున్నాయి.