Vijay Antony: ఆ క్యారెక్టర్​ మహేష్​కి బాగా సూట్​ అవుతుంది​!

Hyderabad: 2016లో వచ్చిన తమిళ్ డబ్బింగ్ సినిమా బిచ్చగాడు(Bichagadu) తో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన కోలీవుడ్​ హీరో విజయ్​ ఆంటోనీ(Vijay Antony). మల్టీటాలెంట్​తో రాణిస్తున్న విజయ్ కెరీర్​లో టర్నింగ్​ పాయింట్​గా నిలిచిన బిచ్చగాడు సినిమాకి సీక్వెల్ గా బిచ్చగాడు 2కి విజయ్​ స్వీయ దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమా మే 19న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు విజయ్ ఆంటోనీ భార్య నిర్మాతగా వ్యవహరించించారు. ఇందులో కావ్య థాపర్(Kavya Thapar) హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఇక తాజాగా బిచ్చగాడు సినిమా గురించి అభిమానులతో మాట్లాడుతూ ఈ సినిమా టాలీవుడ్​ సూపర్​స్టార్​ మహేష్​ బాబుకి బాగా సూట్​ అవుతుందని అభిప్రాయపడ్డారు.

బిచ్చగాడు 2 ప్రమోషన్స్​లో భాగంగా చిత్రబృందం తెలుగులో మీమర్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌ తో చిట్ చాట్ చేశారు. ఇందులో భాగంగా వాళ్ళు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. త్వరలోనే తెలుగులో ఓ సినిమాను డైరెక్ట్​ చేయనున్నట్లు ప్రకటించాడు విజయ్​. ఈ నేపథ్యంలో ఒకరు ‘బిచ్చగాడు సినిమా మీరు కాకపోతే ఇంకెవరు చేస్తే బాగుంటుంది?’ అని విజయ్​ని అడిగాడు.

దీనికి విజయ్.. ‘తెలుగులో అయితే మహేష్ బాబు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఈ పాత్రలోని హావభావాలను మహేష్ అద్భుతంగా పలికించగలరని నమ్మకం’ అన్నారు. ఇక తమిళ్ లో అయితే విజయ్ కానీ, అజిత్ కానీ సూట్ అవుతారని అన్నారు. దీంతో విజయ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవ్వగా మహేష్ అభిమానులు మాత్రం ఈ సినిమా తమ హీరోకి అస్సలు సూటవదంటూ విజయ్​ని ట్రోల్ చేస్తున్నారు.