ముద్దుతో ఆమెకి లేని బాధ మీకెందుకు?

బాలీవుడ్ న‌టుడు వ‌రుణ్ ధావ‌న్ ప‌లువురు నెటిజ‌న్ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసాడు. ఇటీవ‌ల ముంబైలో నీతా ముఖేష్ అంబానీ క‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్ ఈవెంట్ (NMACC) అట్ట‌హాసంగా జ‌రిగింది. బాలీవుడ్, హాలీవుడ్‌కు చెందిన స్టార్ సెల‌బ్రిటీలంతా ఈ ఈవెంట్‌కు హాజ‌రై అంద‌రినీ మెస్మ‌రైజ్ చేసారు. అయితే ఈవెంట్‌లో భాగంగా.. న‌టుడు వరుణ్ ధావ‌న్.. హాలీవుడ్ సూప‌ర్ మోడ‌ల్ గిగి హాడిడ్‌ను స్టేజ్‌పై ఎత్తుకుని గిర‌గిరా తిప్పుతూ బుగ్గ‌పై ముద్దుపెట్టుకున్నాడు. ఈ వీడియో కాస్తా సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది. వరుణ్ ఎప్పుడూ ఇలాగే చేస్తుంటాడ‌ని, ఆమె అసౌక‌ర్యంగా ఫీలైంద‌ని కామెంట్లు చేస్తున్నారు. ఎదుటివారు ఏమ‌నుకుంటారో అని కూడా ఆలోచించ‌కుండా న‌లుగురిలో ఇలా ప్ర‌వ‌ర్తించేవారిని అస‌లు ఈవెంట్‌కి పిల‌వ‌కూడ‌దని తిట్ట‌పోస్తున్నారు. అయితే దీనిపై వ‌రుణ్ స్పందించారు. అదంతా ఈవెంట్‌లో భాగంగానే జ‌రిగిందని, ముద్దుతో ఆ సూప‌ర్ మోడ‌ల్‌కు లేని బాధ ఇంట్లో కూర్చుని కామెంట్లు పెట్టేవారికి ఎందుక‌ని మండిపడ్డాడు.