13 ఏళ్లకే తండ్రైన బాలుడు.. 31 ఏళ్ల మహిళతో ఎఫైర్!
అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలో వింత సంఘటన చోటుచేసుకుంది. చక్కగా ఆడుతూపాడుతూ తిరిగే ఓ పదమూడేళ్ల బాలుడిని అతని ఇంటి పక్కనే ఉంటున్న 31 ఏళ్ల మహిళ తన వలలో వేసుకుంది. ఆ మహిళ చిన్న చిన్న పనులకు నిత్యం తన ఇంట్లోకి బాలుడిని పిలిచేది. ఆ పరిచయం కాస్త శారీరక సంబంధం ఏర్పరుచుకునే వరకు వెళ్లింది. ఇప్పుడామె గర్భవతి కావడంతో ఈ విషయం కోర్టు వరకు చేరింది. ఈ కేసులో ఎలాంటి తీర్పు ఇవ్వాలో తెలియక న్యాయమూర్తులు సైతం తలలు పట్టుకున్నారు.
తలలు పట్టుకున్న న్యాయమూర్తులు…
బాలుడితో సహజీవనం చేసిన మహిళ పేరు ఆండ్రియా సెరానో… ఆమె వయసు 31 సంవత్సరాలు. బాలుడిని ఇంట్లోకి నిత్యం పిలిపించుకునేది. ఇక్కడ ఏం జరిగినా ఎవరికీ చెప్పవద్దని బాలుడిని కోరేది. ఇద్దరి వయసుల్లో చాలా వ్యత్యాసం ఉండటంతో ఎవరూ పట్టించుకోలేదు. ఈక్రమంలో ఆమె గర్భం దాల్చడంతో విషయం బయటపడింది. మైనర్‌పై లైంగిక దాడికి ఆండ్రియా పాల్పడిందని.. బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఈ కేసు కోర్టు వరకు వెళ్లగా.. తమ మధ్య లైంగిక పరమైన సంబంధం నిజమేనని విచారణలో ఆండ్రియా అంగీకరించింది. అయితే.. ఆండ్రియా తరపు న్యాయవాదులు మాత్రం.. సెక్స్ అఫెండర్ కింద కేసు నమోదు చేయాలని .. జైలుకు పంపవద్దని కోరారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తులు త్వరలో తీర్పు వెల్లడిస్తామని.. ఆండ్రియో కడుపులో పెరుగుతున్న బిడ్డకు మాత్రం బాలుడే తండ్రి అని తేల్చింది. మరోవైపు, ఆమె ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని 70 వేల డాలర్ల (రూ. 57 లక్షలు) పూచీకత్తుతో కోర్టు బెయిలు మంజూరు చేసింది. అయితే.. పుట్టబోయే బిడ్డకు మాత్రం బాలుడినే తండ్రిగా పరిగణించాలంటూ ఉత్తర్వులు జారీ చేసి బాలుడి కుటుంబ సభ్యులను కోర్టు షాక్‌కు గురిచేసంది.
బాలుడి తల్లి ఆవేదన ఇలా..
ఈ కేసుకు సంబంధించిన కోర్టు తీర్పుపై బాలుడి తల్లి స్పందించారు. తన బాలుడు అన్ని విధాలుగా నష్టపోయాడని.. న్యాయం చేయాలని న్యాయమూర్తులను ఆమె కోరారు. తమ బిడ్డ బాల్యంలో తండ్రి కావడాన్ని అంగీకరించమని.. ఆ సంబంధం సరైంది కాదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే ఘటనలో తమ కుమారుడి స్థానంలో బాలిక ఉండి.. ఆండ్రియా స్థానంలో పురుషుడు ఉంటే ఇదే విధంగా తీర్పు ఇస్తారా అని ఆమె ప్రశ్నించారు. ఆండ్రియాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాలుడి తల్లి డిమాండ్ చేశారు. ఆండ్రియాను జైళ్లో పెట్టాలని న్యాయమూర్తులను కోరారు.
కొలరాడో రాష్ట్రంలో అశ్లీలత అనేది పెద్ద నేరం కాదు.. దీంతో ఆమెపై చర్యలు సీరియస్‌గా ఉండకపోవచ్చు. అయితే, కొన్ని నివేదికల ప్రకారం.. ఆండ్రియా సెరానోకు న్యాయమూర్తి 10 సంవత్సరాల నుండి ‘సెక్స్ అఫెండర్ ఇంటెన్సివ్ సూపర్‌వైజ్డ్ ప్రొబేషన్’ వరకు జీవిత ఖైదు విధించవచ్చని అంటున్నారు.