Urvashi Rautela ఫోన్ కొట్టేసి.. ఆ ప‌ని చేస్తేనే తిరిగిస్తాన‌న్న వ్య‌క్తి

ప్ర‌ముఖ న‌టి ఊర్వ‌శి రౌతెల‌.. (urvashi rautela) గ‌త శ‌నివారం జ‌రిగిన ఇండియా పాకిస్థాన్ మ్యాచ్‌లో (india pakistan match) త‌న ఐఫోన్ పోగొట్టుకున్నారు. అది మామూలు ఐఫోన్ కాదు. దానికి ఉన్న కేస్‌ను 24 క్యారెట్ గోల్డ్‌తో త‌యారుచేయించుకున్నారు. ఆ ఫోన్ మ్యాచ్ స‌మ‌యంలో పోవ‌డంతో ఊర్వ‌శి ఎంతో బాధ‌ప‌డ్డారు. ఫోన్‌లో చాలా ఇంపార్టెంట్ కాంటాక్ట్స్ ఉన్నాయ‌ని ఎవ‌రికైనా దొరికితే తిరిగివ్వాల‌ని రిక్వెస్ట్ చేసారు. ఫోన్ తెచ్చిస్తే వారికి రివార్డ్ కూడా ఇస్తాన‌ని తెలిపింది.

ఈ నేప‌థ్యంలో ఆ ఫోన్ కాజేసిన వ్య‌క్తి ఊర్వ‌శికి మెయిల్ పెట్టాడు. ఆ ఫోన్ తీసింది తానేన‌ని.. అది తిరిగివ్వాలంటే క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న త‌న సోద‌రుడి ట్రీట్మెంట్‌కు సాయం చేయాల‌ని డిమాండ్ చేసాడు. అత‌ని బాధ‌ను అర్థం చేసుకున్న ఊర్వ‌శి త‌ప్ప‌కుండా సాయం చేస్తాన‌ని హామీ ఇచ్చారు.