Upasana: పాప కంటే మేమే ఎక్కువ ఏడుస్తాం!

upasana says ram charan is her therapist

Upasana: రామ్ చ‌ర‌ణ్ త‌న థెర‌పిస్ట్ అని అన్నారు ఉపాస‌న కామినేని. క్లీంకార పుట్టిన త‌ర్వాత తాను పోస్ట్ పార్టం డిప్రెష‌న్‌లోకి వెళ్లానని.. అప్పుడు చ‌రణ్ త‌న కోసం త‌న పుట్టింట్లోనే కొంత‌కాలం ఉన్నాడ‌ని తెలిపారు.  ఈ విష‌యాన్ని ఉపాస‌న ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు. “” చ‌ర‌ణ్ నాకు థెర‌పిస్ట్. పాప పుట్టాక నేను డిప్రెష‌న్‌లోకి వెళ్లాను. నా వ‌ల్ల కాలేదు. కొంత‌కాలం పాటు మా అమ్మ ద‌గ్గ‌ర ఉండాల‌నుకున్నాను. అందుకు చ‌ర‌ణ్ ఒప్పుకోవ‌డ‌మే కాదు నాతో పాటు మా ఇంటికే వ‌చ్చేసాడు. నాతోనే ఉన్నాడు. మాకు ఉన్న వ‌ర్క్ క‌మిట్మెంట్ల వ‌ల్ల కొన్ని సార్లు పాప‌ను వ‌దిలేసి వెళ్లాల్సి వ‌స్తుంది. అప్పుడు పాప కంటే మేమే ఎక్కువ‌గా ఏడ్చిన సంద‌ర్భాలు ఉన్నాయి. కానీ త‌ప్ప‌దు క‌దా“” అని తెలిపారు.