Spirit: ప్ర‌భాస్‌తో నాలుగోసారి..!

trisha krishnan to be paired opposite prabhas in spirit

Spirit: సందీప్ రెడ్డి వంగా ప్ర‌భాస్ కాంబినేష‌న్‌లో ఓ క్రేజీ సినిమా రాబోతోంది. ఈ సినిమాకు ప్ర‌ముఖ బాలీవుడ్ దిగ్గ‌జం భూష‌ణ్ కుమార్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. సినిమాకు స్పిరిట్ అనే టైటిల్‌ను కూడా పెట్టేసారు. అయితే హీరోయిన్ ఎవ‌రు అనే అంశంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెలకొంది. ఫ్రెష్ పెయిర్‌ని చూపిస్తారా? లేక ఆల్రెడీ చూసేసిన జంట‌నే మ‌రోసారి తెర‌పై చూపిస్తారా అనే డిబేట్ జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పించే రూమ‌ర్ ఒక‌టి వైర‌ల్ అవుతోంది. అదేంటంటే.. ఇందులో ప్ర‌భాస్‌తో పాటు త్రిష జంట‌గా న‌టించ‌బోతున్నార‌ట‌. అదే నిజం అయితే వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రాబోయే నాలుగో సినిమా స్పిరిట్ అవుతుంది. వ‌ర్షం, పౌర్ణ‌మి, బుజ్జిగాడు సినిమాల‌తో త్రిష‌, ప్ర‌భాస్ పెయిర్ ఎవ‌ర్‌గ్రీన్ హిట్ అయిపోయింది.