Rains ఒకవైపు ఎండలు.. మరోవైపు వర్షాలు

Hyderabad: తెలంగాణ రాష్ట్రం(telangana state) హైదరాబాద్(hyderabad) నగర వ్యాప్తంగా ఇవాళ ఉదయం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం(heavy rain fall) కురిసింది. మణికొండ, షేక్ పేట్, ఫిలింనగర్, జూబ్లీహిల్స్‌లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. బంజారాహిల్స్, మాసబ్ ట్యాంక్, మెహదీపట్నం.. ఇటు టోలిచౌకి, అత్తాపూర్, రాజేంద్రనగర్‌లో భారీ వర్షం పడింది. ఈదురు గాలుల ధాటికి పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది. ఇక తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ వర్షం కురిసింది.

తెలంగాణ రాష్ట్రాంలో రోజు రోజుకు ఎండలు పెరిగిపోతున్న తరుణంలో… రానున్న రెండు, మూడు రోజుల్లో మాత్రం వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో దాదాపు 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు అనుభవించిన ప్రజలు.. వాన కబరుతో కాస్త ఉపశమనం పొందుతున్నారు. ఉప్పల్, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, నాగోల్, చైతన్యపురి, మలక్‌పేట్, చార్మినార్‌, బషీర్‌బాగ్‌, నాంపల్లి, కోఠి, అబిడ్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుసింది. మిగతా ప్రాంతాల్లోనూ వాతావరణం చల్లబడి, ఈదురుగాలులు వీశాయి. ఇక, తెలంగాణ వ్యాప్తంగా ఏప్రిల్ 17వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. 15, 16వ తేదీల్లో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

అల్పపీడన ద్రోణి తెలంగాణ నుంచి దక్షిణ తమిళనాడు వరకు విస్తరించి ఉన్నందున రానున్న వారం రోజుల్లో తమిళనాడు, కేరళ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలోని రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. రాబోయే మూడు గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాలకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.