AP CID: ఆ ఇద్ద‌రూ “సాక్షి” నుంచి కాదు

TDP అధినేత చంద్ర‌బాబు నాయుడుని అరెస్ట్ (chandrababu naidu arrest) చేసాక ఏపీ సీఐడీ (ap cid) విజ‌య‌వాడ‌కు తీసుకెళ్లి విచార‌ణ ప్రారంభించింది. విచార‌ణ జరుగుతున్న స‌మ‌యంలో ప‌క్క‌నే ఓ రిపోర్టర్, కెమెరామెన్ (fact check) ఉన్నార‌ని వారిద్ద‌రూ ఏపీ సీఎం జ‌గ‌న్‌కు చెందిన సాక్షి ఛానెల్‌లో ప‌నిచేస్తుంటార‌ని ఓ ప్ర‌ముఖ మీడియా సంస్థ వార్త ప్ర‌చురించింది. కానీ వారిద్ద‌రూ సాక్షిలో పనిచేసేవారు కాదు. ప్ర‌తి విచార‌ణ సంస్థ‌కు అధికారికంగా ఒక కెమెరామ్యాన్, రిపోర్ట‌ర్ ఉంటారు. ఆ స‌మ‌యంలో వారిద్ద‌రికే త‌ప్ప బ‌య‌టి మీడియాకు అనుమ‌తి ఉండ‌దు. పై ఫోటోలో ఉన్న‌వారిద్ద‌రూ కూడా ఏపీ సీఐడీ అధికారిక రిపోర్ట‌ర్, కెమెరామ్యాన్‌లు మాత్ర‌మే. అంతేకానీ వారికి సాక్షి ఛానెల్‌కు ఎలాంటి సంబంధంలేదు.