300ల‌కు పైగా సినిమాల్లో “న‌టించిన” ఈ చెట్టు ఇక లేదు

this tree has appeared in many films now cannot be seen anymore

Tree: ఒక నటుడు నాలుగైదు సినిమాల్లో చిన్న పాత్రలు పోషిస్తే.. అతను చ‌నిపోయిన‌ప్పుడు ఫలానా నటుడి మరణం అని చెప్పుకుంటాం. అలాంటిది మూడు వందలకుపైగా చిత్రాల్లో నటించిన చెట్టు గురించి చెప్పుకోకుండా ఉండగలమా ? సినిమాలపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ గోదావరి గట్టున ఉండే ఈ చెట్టు సుపరిచితం. ఎన్నో సినిమాల్లో ఈ చెట్టు కిందనే కీలక సన్నివేశాలు జరిగాయి. ఈ చెట్టు కిందటనే ఎన్నో కథలు కీలక మలుపులు తిరిగాయి. ఇప్పుడీ చెట్టు కూలిపోయింది. ఇక ఏ సినిమాలోనూ కనిపించదు. . తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవంలో ఉందీ చెట్టు.