Hanuman Chalisa పఠనాన్ని నిషేధించిన ఈసీ.. కారణం ఇదే!
bengaluru: కర్నాటక(karnataka)లో బుధవారం పోలింగ్ జరగనుంది. దీంతో కేంద్ర ఎన్నికల కమిషన్(Election Commission) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల మేనిఫెస్టో(election manifesto)లో కాంగ్రెస్(congress) పార్టీ కర్నాటకలో అధికారంలోకి వస్తే.. బజరంగ్‌దళ్, పీఎఫ్‌ఐ సంస్థలను బ్యాన్ చేస్తామని చెప్పింది. ఈక్రమంలో దీనిపై హిందూ సంఘాలు, బీజేపీ(bjp) పార్టీలు అప్పటి నుంచి కాంగ్రెస్‌పై మండిపడుతున్నాయి. ఈనేపథ్యంలో మంగళవారం నాటు బెంగళూరు నగరంలో హనుమాన్ చాలీసా (Hanuman Chalisa) పఠనం చేయాలని వీహెచ్‌పీ నిర్ణయించింది. అయితే.. ఎన్నికలకు సరిగ్గా 24 గంటలు ఉందనగా.. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం.. నిషేధం(Bans Recitation of Hanuman Chalisa) అని ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో సీఆర్ పీసీ 144 సెక్షన్ విధించినందున వీహెచ్‌పీ సభ్యులు హనుమాన్ చాలీసా పఠించకూడదని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
కర్నాటక వ్యాప్తంగా అన్ని హిందూ ఆలయాల్లో అయిదుగురి కంటే.. ఎక్కువ మంది గుమిగూడ వద్దని ఈసీ తన ఆదేశాల్లో పేర్కొంది. వీహెచ్‌పీ సభ్యులు తమ కార్యక్రమాన్ని కొనసాగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు ఎన్నికలకు ఇక 24 గంటల సమయం మాత్రమే ఉన్నందున ఓటర్లను ప్రభావితం చేసే అంశాలపై పోలీసులు దృష్టి సారించారు. ఓటర్లకు నాయకులు ఇచ్చే తాయిలాలు, డబ్బు పంపిణీని అడ్డుకునేందుకు సిద్దం అయ్యారు.