Bajrang Dal బ్యాన్ చేయడం వెనుక కాంగ్రెస్ లెక్కలు ఇవే..!
Bengaluru: కర్నాటక ఎన్నికల(karnataka elections) సందర్బంగా కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో(congress manifesto)లో ప్రకటించిన అంశాల చుట్టూ.. గత రెండు రోజులుగా చర్చ జరుగుతోంది. మ్యానిఫెస్టోలో రాడికల్ సంస్థలు అయిన బజరంగ్దళ్, ముస్లిం లీగ్ సంస్థలను బ్యాన్(radical organizations ban) చేస్తామని చెప్పి.. సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిపై ముస్లింల నుంచి పెద్దగా వ్యతిరేకత రాలేదు. కానీ హిందువుల నుంచి ముఖ్యంగా ప్రధాని మోదీ(pm modi) మొదలుకుని.. బీజేపీ(bjp) నాయకులు, బజరంగ్దళ్ కార్యకర్తలు అందరూ కలిసి కాంగ్రెస్ (congress) పార్టీ హిందువుల వ్యతిరేకి అంటూ.. ప్రచారం చేస్తోంది. అందుకే హనుమంతుల భక్తులైన బజరంగ్దళ్ సంస్థను రద్దు చేస్తామని చెబుతోందని.. గతంలో కాంగ్రెస్ నాయకులు అసలు రాముడే లేడు, రామసేతు ఎక్కడుంది అని రాముడిని అవమానించారని.. తాజాగా హనుమంతుడిని అవమానిస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. అంతే కాదు.. దీన్నే తమ ప్రచార అస్త్రంగా మార్చుకుంది.
ఎన్నికల వేళ నాయకులు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా.. ఒకటి రెండు సార్లు ఆలోచిస్తుంటారు. అలాంటిది.. రాడికల్ సంస్థలను బ్యాన్ చేస్తాము అనే నిర్ణయాన్ని కాంగ్రెస్ తీసుకోవడానికి పలు కారణాలు కూడా లేకపోలేదు. బజరంగ్దళ్ కార్యకర్తలు మనకు అప్పుడప్పుడూ కనిపిస్తుంటారు. నిత్యం ప్రజల్లో ఉండే ఆర్గనైజేషన్ కూడా కాదు. వీరిపై ప్రజల్లో కూడా సానుకూల వైఖరి లేదు. ఇక ముస్లిం లీగ్ సంస్థ విధ్వేషాలను రెచ్చగొడుతుందని తెలిసిందే. ఈ తరుణంలో రెండు రాడికల్ సంస్థలను రద్దు చేస్తామన్న కాంగ్రెస్ ఉద్దేశం.. శాంతిభద్రతలను కాపాడుకోవడమే. దీంతోపాటు తటస్థమైన ముస్లిం, హిందువుల ఓట్లు పొందాలని ఆ పార్టీ ప్లాన్. అందులో భాగంగానే ఈ అన్ని లెక్కలు వేసుకునే ఈ నిర్ణయం తీసుకుంది. కానీ బీజేపీ బలంగా హిందువులను కాంగ్రెస్ అణచివేస్తోందని రెచ్చగొడుతున్న తరుణంలో.. కాంగ్రెస్ నేతలు కూడా కొంత స్వరం మార్చుకున్నారు. డీకే శివకుమార్ మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా హనుమాన్ ఆలయాలను నిర్మిస్తామని ఇవాళ ప్రకటించారు.