swetha: ఆత్మహత్యకు వారే కారణం.. పోలీసులు ఏమన్నారంటే?

vizag: విశాఖపట్నం(Vizag)లో రెండు రోజుల కిందట అయిదు నెలల గర్బిణి శ్వేత (Swetha) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన సంచలనం రేపింది. ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన ఆమె.. ఐఏఎస్‌ కావాలని కలలు కంది. ఈనేపథ్యంలోనే తనువు చాలించడంపై బాధితురాలి తల్లి అత్తింటి వారిపై పలు ఆరోపణలు చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక దీనిపై విచారించిన పోలీసులు శ్వేత ఆత్మహత్య (suicide) చేసుకున్నట్లు నిర్దారించారు. శ్వేతపై అత్తింటి వేధింపులు వాస్తవమేనని సీపీ శ్రీకాంత్‌ (CP Srikanth) తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడి పలు వివరాలు వెల్లడించారు. 90 సెంట్ల భూమి శ్వేత పేరు మీద ఉందని, ఆ భూమి తన పేరుపై మార్చాలని భర్త ఇబ్బంది పెట్టాడని.. దీంతో ఆమె మనస్తాపం చెందిందని అన్నారు. పెళ్లి తర్వాత చదువుకుంటానని శ్వేత చెప్పగా.. దానికి అత్తమామలు అంగీకరించేలదని, ఈక్రమంలో ఆమె ఆడపడుచు, భర్త కూడా లైంగికంగా వేధింపులకు పాల్పడినట్లు తేలిందన్నారు.

ఈ ఘటనపై గృహ, లైంగిక వేధింపుల కింద కేసు నమోదు చేశామని సీపీ తెలిపారు. శ్వేత భర్త, అత్తా, మామ, ఆడపడుచు ఆమె భర్తను అరెస్ట్‌ చేసినట్లు పేర్కొన్నారు. ఇక శ్వేతకు మణికంఠతో గత ఏడాది ఏప్రిల్‌ 22న వివాహమైంది. మణికంఠ (Manikanta) సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. భార్య, తల్లిదండ్రులతో కలిసి నెల్లిముక్కులో ఉంటున్నారు. ఆఫీస్‌ పనిమీద మణికంఠ హైదరాబాద్‌ (Hyderabad) వెళ్లాడు. శ్వేత మంగళవారం సాయంత్రం భర్తకు ఫోన్‌ చేసింది. ఫోన్‌లో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలిసింది. రాత్రి ఏడు గంటల సమయంలో శ్వేత ఇంట్లోనే ఫోన్‌ను వదిలిపెట్టి తాళం వేసుకుని బయటకు వెళ్లిపోయింది. బుధవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో బీచ్‌రోడ్డులోని వైఎంసీఏ ఎదురుగా తీరంలో శ్వేత ఆత్మహత్య చేసుకోగా.. పోలీసులు మృతదేహాన్ని గుర్తించి ఆమె తల్లికి అప్పగించారు.