The Kerala Story: సినిమాపై తొలిసారి స్పందించిన మోదీ

Bengaluru: కేరళ(kerala)లో జరుగుతున్న ఉగ్రవాదుల కుట్రను ది కేరళ స్టోరీ( the kerala story movie) మూవీ ద్వారా స్పష్టంగా చూపించారని ప్రధాని మోదీ(pm modi) తెలిపారు. మే 10న కర్నాటకలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బళ్లారి(bellari)లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ(congress) మాత్రం ఉగ్రవాదులతో కలిసి కుట్రపూరిత రాజకీయాలకు తెరలేపుతుందని ఆరోపించారు. వారికి అండగా ఉంటూ తెరవెనుక రాజకీయలు చేస్తోందని మండిపడ్దారు. తీవ్రవాదం, ఉగ్రవాద ధోరణులపై తీసిన ది కేరళ  స్టోరీ సినిమాను కాంగ్రెస్‌ వ్యతిరేకిస్తోందని మోదీ అన్నారు. ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ ఉగ్రవాదాన్ని కాపాడతుందోని తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. ఉగ్రవాదంపై బీజేపీ ఉక్కుపాదం మోపుతోందని. కర్నాటక అభివృద్దికి శాంతిభద్రతలు చాలా ముఖ్యమని అన్నారు. హిందువులను లక్ష్యంగా చేసుకుని.. వారిని నిర్వీర్యం చేసే పనిలో కాంగ్రెస్‌ ఉందన్నారు. అందుకే బజరంగ్‌దళ్‌ సంస్థను లేకుండా చూస్తోందని. హిందూ దేవుళ్లపై వారికి భక్తి లేదని ఆరోపించారు.

ఇక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ పొత్తు పెట్టుకుంటుందని వస్తున్న వార్తలపై కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై స్పందించారు. తన రాజకీయ భవిష్యత్తును పార్టీ చూసుకుంటుందని చెప్పారు. ‘‘పోస్ట్ పోల్ అలయన్స్‌‌పై కాంగ్రెస్, జేడీఎస్ మధ్య ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. గత ఎన్నికల తర్వాత వాళ్లు పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా అదే చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ వాళ్లకు పెద్దగా సీట్లు రావు” అని విమర్శించారు. మెజారిటీ ఫిగర్‌‌‌‌ రాకపోతే బీజేపీ ప్రతిపక్షంలో కూర్చునేందుకు సిద్ధంగా ఉందా? అని ప్రశ్నించగా.. ‘‘అసలు అలాంటి పరిస్థితే తలెత్తదని ధీమా వ్యక్తం చేశారు.