Naga Mahesh: మా కోసం ఆరోజు ప‌వ‌న్ షూటింగ్ ఆపేసారు

telugu actor naga mahesh talks about pawan kalyan generosity

Naga Mahesh:  ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌ల్మషం లేని వ్య‌క్తి అని అన్నారు ప్ర‌ముఖ న‌టుడు నాగ మ‌హేష్. ఎన్నో సినిమాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా న‌టించిన మ‌హేష్‌… ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో త‌న‌కు ఎదురైన ఓ అనుభ‌వాన్ని పంచుకున్నారు.

“” ఓ సినిమా షూటింగ్ జ‌రుగుతుండ‌గా లంచ్ స‌మ‌యం కావడంతో అందరం భోజ‌నానికి వెళ్లాం. మేమంతా కింద కూర్చుని తింటుంటే ప‌వ‌న్ వ‌చ్చి చూసారు. మేం తింటున్న ఆహారంలో నాణ్య‌త లేద‌ని అక్క‌డిక‌క్క‌డే నిర్మాత‌ను పిలిచి షూటింగ్ ఆపించేసారు. ఇక నుంచి త‌న‌కు పెట్టే ఆహారాన్నే సెట్‌లో ఉన్న‌వారికి పెట్టాల‌ని.. కావాలంటే ఆ ఖ‌ర్చును త‌న పారితోషికంలో నుంచి క‌ట్ చేసుకోమ‌ని నిర్మాత‌తో చెప్పారు. అది ఆయ‌న గొప్ప‌త‌నం “” అని తెలిపారు.