Telly Tv: యాడ్స్​ చూస్తే టీవీ ఉచితం!

Hyderabad: స్మార్ట్​ ఫోన్లు, టాబ్​లు, ల్యాప్​టాప్​ల వాడకం పెరగడంతో టీవీల మార్కెట్​ పడిపోతోంది. దీన్ని పునరుద్ధరించడానికే అనేక ఫీచర్స్​తో స్మార్ట్​ టీవీలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి తయారీ సంస్థలు. కాగా, కువైట్(Kuwait) కు చెందిన టెలీ(Telly Tv) అనే కంపెనీ వినియోగదారులను ఆకర్షించేందుకు ఓ బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ఫ్లూటో టీవీ వ్యవస్థాపకుడు ఇలియా ఫొజిన్ ఒక ప్రకటన ద్వారా ‘టెలి’ అనే డ్యూయల్ స్క్రీన్ స్మార్ట్ టీవీని ఉచితంగా పొందవచ్చని ప్రకటించారు. ఈ టీవీ కావాలనుకునే మొదటి 5 లక్షల మందికి ఉచితంగా అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏకంగా 55 అంగుళాలు కలిగిన బిగ్ స్క్రీన్ టీవీని ఉచితంగా పొందవచ్చు. 4కెహెచ్ డీఆర్ థియేటర్ డిస్ ప్లే తో ఉన్న ఇందులో వాయిస్ కాలింగ్ సౌకర్యం కూడా ఉంది. 5 డ్రైవర్ ఇమ్మర్సివ్ సౌండ్ తో అలరిస్తుంది.

అయితే ఇక్కడ ఓ చిన్న కిటుకు ఉంది. ఈ టీవీని ఉచితంగా పొందాలంటే మీకు యాడ్స్​ చూసే ఓపిక ఉండాలి. ఈ టీవీలో రెండు స్క్రీన్లు ఉంటాయి. పైన స్క్రీన్లో మీకు ఇష్టమైన కార్యక్రమాలు ప్లే చేసుకోవచ్చు. కింది స్క్రీన్లో మాత్రం నిరంతరం ప్రకటనలు ప్రసారం అవుతూ ఉంటాయి. అంటే మనకు టీవీల్లో వచ్చే కార్యక్రమాలకు మధ్య మధ్యలో వచ్చే అడ్వర్టయిజ్మెంట్స్ ఇందులో లైవ్ లో ప్రసారం అవుతూ ఉంటాయన్నమాట. ప్రస్తుతం ఈ ప్లాన్ అమెరికాలో అందుబాటులో ఉంది. త్వరలోనే ఇతర దేశాలకు విస్తరించాలని ‘టెలీ’ ప్లాన్ చేస్తోంది. మరెందుకు ఆలస్యం.. మన దేశంలోకి ఈ ఆఫర్​ రాగానే మీరూ ఓ టీవీ బుక్​ చేసేయండి!