TS Inter results: ఇంటర్ ఫలితాలపై అధికారుల క్లారిటీ
Hyderabad: : ఏపీలో ఇంటర్ ఫలితాలను(ap inter results) ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక మిగిలింది తెలంగాణ ఇంటర్ ఫలితాలు(telangana inter results). తాజాగా ఫలితాల విడుదలపై అధికారులు ఓ కీలక ప్రకటన చేశారు. మే 10వ తేదీ లోపు ఎట్టి పరిస్థితుల్లో ఫలితాలు విడుదల చేస్తామని అంటున్నారు. వీలైతే.. మే 8న విడుదలకు కసరత్తు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముందస్తు బిజీ షెడ్యూల్ కారణంగా వచ్చే శని, ఆదివారాల్లో ఫలితాలను ప్రకటించే అవకాశంలేదని తెలుస్తోంది.
ఈ క్రమంలో సోమవారం అంటే ఈ నెల 8న ఇంటర్ ఫలితాలను ప్రకటించాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఫలితాల్లో ఎలాంటి తప్పులు, సమస్యలకు తావివ్వకుండా ఈసారి ఇంటర్ ఫలితాలను పకడ్బందీగా వెల్లడించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. అందుకే ఫలితాల వెల్లడిలో కాస్త సమయం తీసుకుంటోంది. ఒకటికి రెండు సార్లు మార్కుల నమోదు, క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఫలితాలను వెల్లడించేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణలో ఇంటర్ రెండు సంవత్సరాలకు సంబంధించి మొత్తం 9.47లక్షల మంది హాజరయ్యారు.