telangana: ఉచితంగా బూస్టర్ డోస్!
Hyderabad: దేశ వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం(telangana government) కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి రాష్ట్రంలో మళ్లీ బూస్టర్ డోస్(booster dose) పంపిణీ చేయబోతోంది. ఈ మేరకు బుధవారం నుంచి రాష్ట్రంలోని అన్ని పీహెచ్ సీలు, యూపీహెచ్ సీల్లో బూస్టర్ డోస్ టీకాలు అందుబాటులో ఉంచుతున్నట్లు ప్రజారోగ్యం మరియు కుటుంబ సంక్షేమ డైరెక్టర్ మంగళవారం ప్రకటన విడుదల చేశారు. బూస్టర్ డోస్ గా కార్బే వ్యాక్స్ (corbevax)ను ప్రభుత్వం అందించబోతోంది. మొదటి రెండు డోసులు కొవిషీల్డ్ లేదా కొవాగ్జిన్ తీసుకున్నా బూస్టర్ డోస్ గా కార్బే వ్యాక్స్ తీసుకోవచ్చని పేర్కొంది. 5 లక్షల బూస్టర్ డోస్‌లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది.