Tadepalli: సీఎం జగన్‌తో బాలినేని భేటీ.. హీట్‌ పెంచుతున్న పవర్‌ పాలిటిక్స్‌!

vijayawada: ప్రకాశం జిల్లా మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి(ex minister balineni srinivas reddy) పంచాయతీ తాడేపల్లి(tadepalli)కి చేరింది. తాజాగా ఇవాళ ఆయన సీఎం జగన్‌(cm jagan)తో భేటీ అయ్యారు. జగన్‌ పిలుపుమేరకు హైదరాబాద్‌ నుంచి బాలినేని మంగళవారం మధ్యాహ్నం తాడేపల్లికి ఆయన చేరుకున్నారు. ఇక గత కొంతకాలంగా బాలినేని.. వైసీపీపై గుర్రుగా ఉంటూ వస్తున్నారు. వాస్తవానికి బాలినేనిని మంత్రి పదవి నుంచి తొలగించిన నాటి నుంచి ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయి. ప్రకాశం జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేష్‌కు రెండోసారి మంత్రి పదవి దక్కడంపై బాలినేని అప్పట్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి పదవి ఉంటే ఇద్దరికీ ఉండాలి.. లేదంటే.. ఇద్దరికీ వద్దని బాలినేని సూచించనప్పటికీ జగన్‌ పట్టించుకోలేదు.

గత నెలలో మార్కాపురంలో జరిగిన సీఎం సమావేశానికి ఆయన హాజరు కాగా.. హెలిప్యాడ్‌ వద్దకు కారులో వెళ్తున్న బాలినేనిని పోలీసులు అడ్డుకున్నారు. కారు దిగి వెళ్లాలని కోరారు. మంత్రి సురేష్‌ కారును మాత్రం అనుమతించారు. దీంతో బాలినేని అలిగి సమావేశంలో పాల్గొనకుండా వెళ్లిపోయారు. ఈ విషయంపై సీఎం జోక్యం చేసుకోవడంతో తిరిగి వివాదం సద్దుమణిగినట్టు కనిపించినా… గత మూడు రోజుల కిందట నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాలకు రీజనల్‌ కో ఆర్డినేటర్‌గా ఉన్న బాలినేని.. ఆ పదవికి రాజీనామా చేశారు. దీంతో పార్టీ పెద్దలు కలగజేసుకుని బాలినేని తాడేపల్లికి రావాలని కోరినా.. ఆయన స్పందించలేదని సమాచారం.

ప్రకాశం జిల్లాలో బాలినేనికి తగిన ప్రాధాన్యం లేదని.. ఆయన వర్గం ఆరోపిస్తోంది. కనీసం కానిస్టేబుల్‌ని బదిలీ చేసే పవర్‌ కూడా లేకుండా పోయిందని.. అందుకే అసంతృప్తితో ఉన్నారని సమాచారం. జిల్లా రాజకీయాల్లో కూడా బాలినేనితో సంబంధం లేకుండా.. పదవుల కేటాంయింపుల దగ్గరి నుంచి సమావేశాలు జరుగుతున్నాయి. ఇక సీఎం జగన్‌ సమావేశం తర్వాత.. తిరిగి బాలినేనికి జిల్లాలో ఫుల్‌ పవర్‌ ఇస్తారో లేదో చూడాలి.