Madhapur: ఓయో హోట‌ల్ నుంచి దూకి యువ‌కుడి ఆత్మ‌హ‌త్య‌

suicide incident at madhapur oyo hotel

Madhapur: హైద‌రాబాద్‌లోని మాదాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. అయ్య‌ప్ప సొసైటీలోని ఓయో హోట‌ల్ నుంచి ఓ యువ‌కుడు దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. హోట‌ల్‌లోని ఆరో అంతస్తు నుంచి దూకేసిన‌ట్లు తెలుస్తోంది. ఆరో అంత‌స్తులో ఓ ప‌రుపు కూడా ల‌భించింద‌ని పోలీసులు తెలిపారు. మృతుడి పేరు సాయిగా గుర్తించారు. సాయితో పాటు మ‌రో వ్య‌క్తి హోట‌ల్‌లోని ఆరో అంత‌స్తులో ప‌రుపు వేసుకుని దానిపై కూర్చుని మ‌ద్యం సేవించార‌ని.. ఆ త‌ర్వాత సాయి లేవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న‌ప్పుడు జారి ప‌డిపోయి ఉండే అవ‌కాశం కూడా ఉంద‌ని పోలీసులు చెప్తున్నారు. ఈ కేసుపై పోలీసులు క్షేత్ర స్థాయిలో ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు.