స్టైలిష్​ స్టార్ న్యూలుక్స్​..కేక‌!

సినిమాకి తగినట్టు లుక్స్​లో కొత్తదనంతో కనిపిస్తారు స్టైలిష్​ స్టార్​ అల్లు అర్జున్​. క్లాస్​ అయినా, మాస్​ అయినా బన్నీ డిఫరెంట్ లుక్స్​తో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. యాక్టింగ్​, డాన్స్​తోపాటు లుక్స్​లోనూ స్టైల్​ని జోడించి మెప్పిస్తారు బన్ని. ఎప్పుడూ సాఫ్ట్​ అండ్​ స్టైలిష్​ లుక్స్​తో అదరగొట్టే బన్ని ‘పుష్ప’తో తనలోని మాస్​ యాంగిల్​ని చూపించారు. ఇక ప్రస్తుతం బన్ని ‘పుష్ప 2’తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా, శుక్రవారం ముంబై ఎయిర్​పోర్ట్​లో కెమెరాకి చిక్కిన బన్ని కొత్త లుక్స్​లో కనిపించి ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్​ మీడియాలో వైరల్​గా మారగా, ఈ సరికొత్త లుక్స్ తదుపరి సినిమా కోసమేనంటూ కామెంట్స్​ చేస్తున్నారు నెటిజన్లు. క్రియేటివ్​ డైరెక్టర్​ సుకుమార్​ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’తో పాన్​ ఇండియా స్టార్​గా ఎదిగారు బన్ని. ఎర్రచందనం స్మగ్లింగ్​ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బన్ని ఆట, పాట, డైలాగ్స్​తో టాలీవుడ్​తో పాటు బాలీవుడ్​నీ ఓ ఊపు ఊపింది. ఈ సినిమాలో శ్రీవల్లిగా నేషనల్​ క్రష్​ రష్మికా మందన్నా నేచురల్​ లుక్స్​లో అందరినీ ఆకట్టుకుంది. ఇక పుష్ప సీక్వెల్​ తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు బన్ని. ​

కాగా, శుక్రవారం ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్నఐకాన్​ స్టార్​ ఐకానిక్​ స్టైల్​లో కూల్ లుక్స్​తో కనిపించారు. ప్రింటెడ్ షర్ట్, వైట్ ప్యాంట్‌లో చాలా సింపుల్‌గా ఉన్న బన్నీ తన హెయిర్ స్టైల్‌తో ఆకర్షించారు. బంగారు, నలుపు వర్ణంలో ఉన్న జుట్టుకు వెనక తోకలా పెంచారు. ఇప్పటి వరకు బన్నీని ఇలాంటి హెయిర్ స్టైల్‌లో చూడలేదు. ఇది చాలా కొత్తగానూ, అంతే స్టైలిష్‌గానూ ఉంది. అయితే, ఈసారి పుష్పరాజ్‌ను రస్టిక్‌గానే కాకుండా స్టైలిష్‌గా కూడా చూడబోతున్నామంటూ సంబరపడిపోతున్నారు అభిమానులు.
ఎయిర్‌పోర్టు వద్ద అల్లు అర్జున్​ని తమ కెమెరాల్లో బంధించేందుకు చాలా ప్రయత్నించారు విలేకరులు. కానీ వాళ్లు ‘అల్లు అర్జున్ అన్న.. ప్లీజ్.. అన్న’ అంటూ ఆపే ప్రయత్నం చేసినా బన్నీ ఆగలేదు. ఎప్పటిలానే తన స్టైల్‌లో చేత్తో ఇక చాలు అన్నట్టు సైగ చేసి వెళ్లిపోయారు.

ఇక, అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న ‘పుష్ప: ది రూల్’ ప్రమోషనల్ వీడియోను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు దర్శకుడు సుకుమార్. 3 నిమిషాల యాక్షన్ టీజర్‌ను బన్నీ బర్త్‌డే గిఫ్ట్‌గా విడుదల చేయబోతున్నారని సమాచారం. ఈ టీజర్‌తో ‘పుష్ప 2’ ప్రమోషన్స్ షురూ అవుతాయన్నమాట. టాలీవుడ్​తోపాటు బాలీవుడ్​ ప్రేక్షకులూ పుష్ప2 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదల తర్వాత బన్నీ సందీప్​ రెడ్డి వంగా దర్శకత్వంలో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.