plants: ఒత్తిడికి గురైతే వింత శబ్దాలు చేస్తాయంట… మీకు తెలుసా?

vijayawada: సాధారణంగా మనుషులు లేదా జంతువులు ఒత్తిడి కలిగినప్పుడు లేదా ఏదైనా ఇబ్బంది అనిపిస్తేనో, కోపం వచ్చినప్పుడు అరవడం వంటికి చేస్తుంటారు. కానీ మొక్కలు కూడా ఒత్తిడి, సరిగా నీరు లభించిన పరిస్థితిలో, ఏదైనా ఇబ్బంది కలిగితేనో అవి కూడా వివిధ రకాల శబ్దాలు చేస్తాయంటండీ.. వినడానికి వింతగానే ఉన్న మొక్కలపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు మాత్రం నిజమని చెబుతున్నారు. కానీ మీకో అనుమానం రావచ్చు.. మనం ఎప్పుడూ మొక్కలు చేసే శబ్దాలు గాలి వీచినప్పుడు తప్పా.. మిగిలిన సమయాల్లో వినలేదు కదా అని.. నిజమే ఎవరూ వినలేనంత పౌనఃపుణ్యంతో అవి శబ్దాలు చేస్తాయి కాబట్టి మనం వినలేకపోతున్నారు. ఆ శబ్దాలు వినాలంటే ప్రత్యేక పరికరాలు అవసరమని చెబుతున్నారు పరిశోధకులు.

మొక్కలకు నీరు లభించనప్పుడు.. అవి మానవులు వినలేని పౌనఃపున్యంతో కూడిన ‘స్క్రీమ్’ను విడుదల చేస్తాయని ఒక కొత్త అధ్యయనం చెబుతోంది. జర్నల్ సెల్‌లో ప్రచురించిన పరిశోధనలో ప్రకారం మొక్కలు ఒత్తిడికి ప్రతిస్పందనగా గాలిలో శబ్దాలను కూడా ఉత్పత్తి చేయగలవని అందులో తెలియజేశారు. టెల్ అవీవ్ యూనివర్శిటీ నిపుణులు టొమాటో, పొగాకు మొక్కలు, ఇతర మొక్కలపై వారు పరిశోధనలు చేసి అవి శబ్దాలు చేస్తున్నట్లు గుర్తించారు. మనుషులకు ఆ శబ్దాలు వినిపించకపోయినా.. వివిధ రకాల జీవులు వాటిని వింటున్నాయని.. అవి వెంటనే ప్రతిస్పందిస్తున్నాయని అంటున్నారు. మొక్కల్లో జరిగే జీవ రసాయన ప్రతిస్పందనలను పరిశీలించిన పరిశోధకులు.. వాటికి మెరుగైన కాంతి, గురుత్వాకర్షణ, ఉష్ణోగ్రత, కావాల్సిన రసాయనాలు, నీరు వంటి వాటిని పుష్కలంగా అందించి.. వాటి పెరుగుదలలో వచ్చిన అసాధారణ మార్పులను గమనించారు. ఈ శబ్ద సంకేతాల ఆధారంగా మొక్కలకు కావాల్సిన నీరు, ఎరువులను అందించిన తర్వాత వాటి పెరుగుదల, పునరుత్పత్తిలో పెనుమార్పులు సంభవించినట్లు వారు అంటున్నారు. గతంలోనూ తేనెను ఉత్పత్తి చేసే మొక్కల శబ్దాలను రికార్డు చేసి.. ఏ మొక్కలు అధికంగా తేనెను ఇస్తాయి అన్నది నిర్దారించి విజయం సాధించారు.