SSMB28: సంక్రాంతికి వచ్చేస్తున్నాడు!
సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పింది ప్రముఖ నిర్మాణ సంస్థ హరిణి అండ్ హాసినీ క్రియేషన్స్. అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న SSMB28 రిలీజ్ డేట్ ఎప్పుడో చెబుతూ ఓ పోస్టర్ విడుదల చేసింది. ట్విటర్ ట్రెండింగ్‌లో ఉన్న ఈ పోస్టర్ చూసి ఈ సినిమాలో మహేష్ మాస్ లుక్‌తో అదరగొట్టబోతున్నాడని అర్థమవుతోంది. సిగరెట్ తాగుతూ నడుస్తున్నమహేష్ పోస్టర్ని రిలీజ్ చేశారు మేకర్స్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. SSMB28 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
అతడు, ఖలేజా తర్వాత వీరిద్దరఇ కాంబినేషన్లో రాబోతున్న సినిమా కావడంతో సినీ వర్గాల్లోనూ ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ని ఉగాది కానుకగా రివీల్ చేస్తారని అంతా భావించారు. కానీ మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి టైటిల్ ఫిక్స్ అయ్యిందనీ, త్వరలోనే ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు అయోధ్యలో అర్జునుడుతో పాటు మరికొన్ని పేర్లు ప్రచారంలో ఉన్నాయి. త్రివిక్రమ్ తన ప్రతి సినిమాకు తెలుగుదనం ఉట్టిపడే టైటిల్స్ నిర్ణయిస్తుంటారు. ఈ సినిమాకు అలాంటి పొయేటిక్ టైటిల్‌ను మహేష్ మూవీకి ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.
SSMB28 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో మహేష్‌బాబుకు జోడీగా పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీలీల సెకండ్ హీరోయిన్‌గా కనిపించబోతున్నది. నిజానికి ఈ సినిమాను ఏప్రిల్ 28న రిలీజ్ చేయాలని భావించారు. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో ఆగస్ట్‌కు వాయిదా వేశారు. కాగా, ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. జనవరి 13, 2024 రిలీజ్ డేట్‌తో తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌తో విడుదల తేదీపై క్లారిటీ వచ్చింది. ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. SSMB28గా వస్తున్న ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ కాంబినేషన్ గా తెరపైకి రాబోతున్న మహేశ్ బాబు SSMB28 సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. మహేశ్ బాబుతో చేస్తున్న మూడో సినిమా కావడంతో అటు ప్రేక్షకుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ కూడా ఈ సినిమా హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ సినిమా టైటిల్ విషయంలో ఇప్పటికీ ఓ క్లారిటీ రాలేదు. ‘అయోధ్యలో అర్జునుడు’, ‘అతడే పార్థు’, ‘అమరావతికి అటు ఇటు’వంటి టైటిళ్లు వినిపించగా త్రివిక్రమ్ తన స్టైల్ టైటిల్‌కే ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. అదేంటో తెలియాలంటే అధికారికంగా ప్రకటించేవరకు ఆగాల్సిందే! ఇక ఈ సినిమా తర్వాత మహేష్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే!