సమంతను అలా చూడటం అదే మొదటిసారి: శోభిత
ప్రముఖ నటి శోభిత ధూలిపాళ్ల ఇటు తెలుగు, అటు తమిళం మరోపక్క హిందీ సినిమాలతోనూ బిజీ అయిపోయింది. వరుస అవకాశాలతో క్షణం తీరికలేకుండా గుడుపుతున్న శోభిత.. తన సోదరి వివాహంలో సందడి చేసింది. శోభితకు సమంత అనే సోదరి ఉంది. ఆమె వివాహం వైజాగ్‌లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో పెళ్లి ఫంక్షన్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన సోదరిని మొదటిసారి పెళ్లికూతురి ముస్తాబులో చూసి ఎమోషనల్ అయ్యానని తెలిపింది. పెళ్లి పనులన్నీ తానే దగ్గరుండి చూసుకున్నానని, కనీసం తయారవడానికి మెహెందీ పెట్టుకోవడానికి కూడా సమయం దొరకలేదని తెలిపింది శోభిత.