Slum Dog Husband: కుక్క‌తో పెళ్లి.. విడాకులు!

Hyderabad: ఇద్ద‌రు వ్య‌క్తులు పెళ్లి చేసుకోవాలంటే జాత‌కంలో ఏదో దోషం ఉంద‌ని, ఓ కుక్కని పెళ్లి చేసుకుంటే ఆ దోషం పోతుంద‌ని వినే ఉంటాం. కొన్ని నార్త్ ఇండియా గ్రామాల్లో అయితే ఇలాంటి ప‌రిహారాలు కూడా చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఇదే కాన్సెప్ట్‌ను సినిమాగా తీసుకొస్తున్నారు. ప్ర‌ముఖ న‌టుడు బ్ర‌హ్మాజీ (brahmaji) కొడుకు సంజ‌య్ (sanjay rao) న‌టించిన కొత్త మూవీ స్ల‌మ్ డాగ్ హ‌జ్బెండ్ (slum dog husband). ఏ.ఆర్ శ్రీధ‌ర్ డైరెక్ట్ చేసారు. సంజ‌య్‌, ప్ర‌ణ‌వి క‌పుల్‌గా న‌టించారు.

వీరిద్ద‌రూ పెళ్లి చేసుకోవాలంటే జాత‌కంలో దోషం ఉంద‌ని, కుక్క‌ను పెళ్లి చేసుకుంటే ఆ దోషం పోతుంద‌ని పంతులుగారు చెప్తారు. దాంతో సంజ‌య్ అంద‌రినీ పిలిచి మ‌రీ కుక్క‌ను పెళ్లి చేసుకుంటాడు. ఆ త‌ర్వాత దోషం పోయింద‌ని ఇప్పుడు న‌చ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవ‌చ్చ‌ని పంతులుగారు చెప్తారు. కానీ ఆ పెళ్లి జ‌ర‌గ‌నివ్వ‌కుండా కేసు పెడ‌తాడు కుక్క య‌జ‌మాని. మొద‌టి భార్య‌కు విడాకులు ఇవ్వ‌కుండా రెండో పెళ్లి ఎలా చేసుకుంటారు అని చెప్పి కుక్క‌తో విడాకులు ఇప్పించాల‌ని చూస్తారు. చూడ‌బోతే మ‌రో ఫ‌న్నీ కాన్సెప్ట్ ఆడియ‌న్స్ ముందుకు రాబోతోంద‌ని తెలుస్తోంది.