Siddaramaiah: క‌ర్ణాట‌క CM సిద్ధారామయ్యేన‌ట‌..!

Bengaluru: క‌ర్ణాట‌క(karnataka) ముఖ్య‌మంత్రిగా అధిష్ఠానం సిద్ధారామ‌య్య‌ను(siddaramaiah) ఎంపిక‌చేసిన‌ట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా సుదీర్ఘ మంతనాల తర్వాత.. సీఎం పగ్గాలను సిద్ధూకే అప్పగించిన‌ట్లు స‌మాచారం. పార్టీ దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మ‌రి కాసేప‌ట్లో ప్ర‌క‌టించేస్తార‌ట‌. అదే నిజం అయితే.. రేపు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు.

ఇవాళ ఉదయం కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తో సిద్ధరామయ్య మరోసారి భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు చర్చించిన తర్వాత 10 జన్‌పథ్ నుంచి సిద్ధూ వెళ్లిపోయారు. అనంతరం కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌తోనూ రాహుల్ సమావేశమయ్యారు. పార్టీ వ్యూహాలపై ఆయన డీకేతో చర్చించారు. వచ్చే ఏడాది జరిగే లోకసభ ఎన్నికల వరకు పీసీసీ బాధ్యతలు నిర్వహించాలని కోరారు. దీంతో పాటు డిప్యూటీ సీఎం బాధ్యతలను తీసుకునేలా డీకేను రాహుల్‌ ఒప్పించారు. ఆ పదవితోపాటు కీలక మంత్రిత్వ శాఖలను అప్పగించారు.

కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య మే 18వ తేదీన మధ్యాహ్నం 3.30 గంటలకు కంఠీరవ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ఆయనకు అధికారులు ప్రొటోకాల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. అటు సిద్ధూ ఇంటి వద్ద కూడా భద్రతను పెంచారు.