‘రాత్రి ఇంటికొస్తే స్టార్‌ని చేస్తానంది’
సినీ పరిశ్రమలో అవకాశాలు రావాలంటే కాస్టింగ్‌కౌచ్‌ని ఎదుర్కోవలసిందే అంటూ చాలామంది హీరోయిన్లు, ఫీమేల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు తరచూ చెబుతూనే ఉన్నారు. కాస్టింగ్ కౌచ్ బాధితులంతా మీటూ అంటూ తాము ఎదుర్కొన్న పరిస్థితులు చెప్పుకుంటున్నారు. ఈ మీటూ ఉద్యమం అటు బాలీవుడ్ నుంచి ఇటు కోలీవుడ్ వరకూ విస్తృతంగా జరుగుతూనే ఉంది. కాగా, సినీ పరిశ్రమలో మహిళలే కాదు, కొన్నిసార్లు మగవారు కూడా కాస్టింగ్‌కౌచ్ సమస్య ఎదుర్కోవలసి వస్తుందని తాజా పరిస్థితుల వల్ల తెలుస్తోంది. ఇటీవల శాండల్‌వుడ్‌కు చెందిన ప్రముఖ నటుడు, ఎంపీ రవికిషన్ కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘ నన్ను కూడా కాస్టింగ్ కౌచ్ చేశారు. ఒక ఆవిడ నాకు రాత్రికి కాఫీ ఆఫర్ చేసి రమ్మంది. ఆమె అప్పుడు మాట్లాడిన మాటలు, చెప్పే విధానం నాకు అర్థమైంది. ఇప్పుడు ఆమె చాలా పెద్ద బిగ్ షాట్ అయింది. ఆమె పేరు నేను చెప్పదలుచుకోవట్లేదు’ అంటూ తను ఎదుర్కొన్న అనుభవాన్ని చెప్పుకొచ్చారు రవికిషన్. దీంతో రవికిషన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
కాగా, తాజాగా మరో నటుడు కూడా తానూ కాస్టింగ్ కౌచ్ బాధితుడినే అంటూ కామెంట్స్ చేశాడు. బాలీవుడ్ నటుడు, హిందీ బిగ్‌బాస్ 16తో పేరు తెచ్చుకున్న శివఠాక్రే కాస్టింగ్ కౌచ్ పై కామెంట్స్ చేశాడు. శివఠాక్రే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘బాలీవుడ్ లో అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా సమస్యలు ఉంటాయని నాకు అర్థమైంది. ఒకసారి నేను ఆడిషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఓ డైరెక్టర్ ఆడిషన్ అయ్యాక మసాజ్ సెంటర్ కి రా, నీతో పని ఉంది అని చెప్పాడు. నాకు అలాంటి పని చేయడం ఇష్టం లేదు అందుకే నేను అక్కడి నుంచి వచ్చేశాను. మరోసారి అవకాశాల కోసం కష్టపడుతుంటే ఓ మహిళ అర్ధరాత్రి 11 గంటలకు తన ఇంటికి నన్ను ఆడిషన్‌కి రమ్మంది. తను చాలా మందిని స్టార్స్ చేసిందని, నేను కూడా వస్తే నన్ను కూడా స్టార్ చేస్తానంది. తాను చెప్పేది నాకు అర్థమై నేను సీరియస్ గా రానని చెప్పడంతో ‘‘నీకు ఇండస్ట్రీలో పని చేయాలని లేదా? నువ్వు రాత్రికి రాకపోతే నీకు పని దొరకదు ఇక్కడ’’ అని సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అయినా నేను వెళ్ళలేదు. అదొక్కటే కాదు, అలాంటి మరికొన్ని సంఘటనలు కూడా ఎదుర్కొన్నా’ అని చెప్పుకొచ్చాడు యంగ్ హీరో శివఠాక్రే. కాగా, మొన్న రవికిషన్, ఇప్పుడు శివఠాక్రే ఇలా కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడటంతో అబ్బాయిల సమస్యలు కూడా బయటకి వస్తున్నాయని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ నేపథ్యంలో ఇంకెవరైనా తమ అనుభవాలను పంచుకుంటారో చూడాలి మరి.