“బుమ్రా కంటే ష‌మీ బెస్ట్ .. ఫిట్‌గా లేక‌పోయినా తీసుకోవ‌చ్చు”

shami is not like bumrah says sanjay manjrekar

Mohammed Shami: స్టార్ ఇండియ‌న్ బౌలర్ జ‌స్ప్రీత్ బుమ్రా కంటే మ‌హ్మ‌ద్ ష‌మీ బెట‌ర్ అని కీల‌క వ్యాఖ్య‌లు చేసారు మాజీ క్రికెట‌ర్ సంజ‌య్ మంజ్రేక‌ర్. ప్ర‌స్తుతం ష‌మీ కాలికి గాయం కావ‌డంతో మ్యాచ్‌ల‌కు దూరంగా ఉంటూ కోలుకుంటున్నాడు. ఇత‌ను బోర్డ‌ర్ గవాస్క‌ర్ ట్రోఫీలో ఆడ‌తాడో లేదో కూడా డౌటే. అందుకే ష‌మీ లేక‌పోతే బుమ్రానే తీసుకోవాల‌ని టీమిండియా భావిస్తోంది. ఈ నేప‌థ్యంలో సంజ‌య్ మంజ్రేక‌ర్ సెలెక్ట‌ర్ల‌కు ఒక స‌ల‌హా ఇచ్చారు. ఒక ర‌కంగా చూసుకుంటే బుమ్రా కంటే ష‌మీ బెట‌ర్ అని అన్నారు.  బుమ్రా త‌న ఫిట్‌నెస్‌నంతా ఉప‌యోగించి బౌలింగ్ చేస్తుంటాడ‌ని.. కానీ ష‌మి మాత్రం టెక్నిక్‌తో బౌలింగ్ చేస్తుంటాడ‌ని అన్నారు. ఇప్పుడు ష‌మీకి గాయ‌మైంది కాబ‌ట్టి ఫిట్‌గా లేడు అనుకుని బుమ్రా తీసుకునే బ‌దులు.. 90 శాతం ఫిట్‌నెస్ ఉన్నా ష‌మీనే ఎంచుకోవ‌డం బెట‌ర్ అని అభిప్రాయ‌ప‌డ్డారు. ఎందుకంటే బుమ్రాని తీసుకోవాలంటే అత‌ను 100 శాతం ఫిట్‌గా ఉన్నాడా లేదా అని చూసుకోవాల‌ని.. కానీ ష‌మీకి 90 శాతం ఫిట్‌గా స‌రిపోతుంద‌ని తెలిపారు.