అసలు ఆ డేటింగ్ గురించి నేను మాట్లాడలేదు!
నటి సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సామ్ బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. అయితే కొందరు జర్నలిస్టులు సామ్‌ను సినిమాల గురించే కాకుండా వ్యక్తిగత విషయాలను కూడా అడుగుతున్నారు. వాటికి సామ్ బ్యాలెన్స్డ్గా సమాధానం చెబుతూ వచ్చారు. అయితే సామ్ ఓ ఇంటర్వ్యూలో డేటింగ్‌ల గురించి మాట్లాడినట్లు ఓ ప్రముఖ వెబ్సైట్ రాసింది. “ఎవరు ఎవరితో రిలేషన్లో ఉన్నారు అన్న విషయాన్ని నేను పట్టించుకోను. ఎంతమందితో డేటింగ్లో ఉన్నా ఒక వ్యక్తి ప్రేమకు విలువ ఇవ్వకపోతే చివరికి కన్నీళ్లే మిగులుతాయి. కనీసం ఆ అమ్మాయి సంతోషంగా ఉండాలి” అని సమంత ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు వార్త పబ్లిష్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ పోస్ట్‌ను సమంతను కూడా ట్యాగ్ చేయడంతో ఆమె వెంటనే స్పందించారు. అసలు నేను ఇలా ఎప్పుడూ అనలేదు అని స్పష్టం చేసారు.
శాకుంతలం ప్రమోషన్స్‌లో భాగంగా సామ్ తన వ్యక్తిగత జీవితం గురించి చాలానే మాట్లాడారు. తాను ప్రేమ, పెళ్లి విషయంలో 100% నిజాయతీగా ఉన్నానని, అయినప్పటికీ దురదృష్టవశాత్తు పెళ్లి అనేది వర్కవుట్ కాలేదని తెలిపారు. తాను ఏ తప్పూ చేయనప్పుడు ఏడుస్తూ ఇంట్లో కూర్చోవడం సరికాదు అనిపించిందని అందుకే డైవర్స్ గురించి ప్రకటించిన వెంటనే ఊ అంటావా సాంగ్‌కు ఓకే చేసానని అన్నారు. మరోపక్క సమంత మాజీ భర్త నాగచైతన్య.. సినీ నటి శోభిత దూళిపాళ్ల లండన్‌లోని ఓ రెస్టారెంట్లో దిగిన ఫోటో ఒకటి వైరల్ అయింది. ఈ నేపథ్యంలో కొందరు సమంత డేటింగ్ గురించి అలా అన్నారు ఇలా అన్నారు అంటూ రకరకాల పోస్ట్‌లు చేసేస్తున్నారు.