Saina Nehwal: తప్పంతా వినేష్‌దే.. ఒలింపిక్ రూల్స్ తెలీదా?
Saina Nehwal: భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగాట్ ఒలింపిక్స్‌లో ఫైనల్స్ నుంచి డిస్‌మిస్ అయిన సంగతి తెలిసిందే. ఆమె పట్ల యావత్ భారతదేశం జాలి చూపిస్తోంది. రెజ్లింగ్ నుంచి రిటైర్ అవుతున్నట్లు వినేష్ ప్రకటించడంతో ఆమె అభిమానులు ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. కేవలం 100 గ్రాముల అధిక బరువు ఉండడంతో వినేష్ ఫైనల్స్‌కు వెళ్లలేకపోయింది. దీనిపై బ్యాడ్మింటన్ లెజెండ్ సైనా నెహ్వాల్ స్పందించారు. ఈ విషయంలో తప్పంతా వినేష్‌దే అని అన్నారు. వినేష్‌కి ఒలింపిక్స్ కొత్త కాదని అలాంటప్పుడు ఆమెకు రూల్స్ తెలిసి ఉండాలని అన్నారు. ఫైనల్ మ్యాచ్ ఉందని తెలిసినప్పుడు బరువు విషయంలో వినేష్ ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆమెకు తెలిసుండాలని.. కానీ చివరి నిమిషంలో ఏం తప్పు చేసిందో అర్థంకావడంలేదని సైనా తెలిపారు.