RT74: క్రేజీ డైరెక్టర్‌తో మాస్ మహారాజ!
Hyderabad: జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు మాస్ మహారాజ రవితేజ(Raviteja). గతేడాది ధమాకా(Dhamaka)తో ఫర్వాలేదనిపించినా వరుస ప్లాపులు రవితేజను కలవర పెడుతున్నాయి. ఇటీవల భారీ అంచనాల మధ్య రిలీజైన రావణాసుర(Ravanasura) కూడా డిజాస్టర్ గానే మిగిలింది. దాంతో కథలు, డైరెక్టర్ల ఎంపికలో కాస్త జాగ్రత్త తీసుకుంటున్నట్లు సమాచారం. ఇటీవలే తన తదుపరి సినిమా టైగర్ నాగేశ్వర్ రావు(Tiger Nageswara Rao) ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సినిమాతో అయినా సక్సెస్ ట్రాక్ ఎక్కాలనుకుంటున్నారు రవితేజ. తాజాగా క్రేజీ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నఅనుదీప్(Anudeep KV)తో రవితేజ సినిమా ఫైనల్ అయినట్లు తెలుస్తోంది.
జాతిరత్నాలు, ప్రిన్స్ ఫేమ్ అనుదీప్ కేవీతో ఓ సినిమా చేసేందుకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. రీసెంట్గా ఈ క్రేజీ దర్శకుడు రవితేజని కలిసి ఒక స్టోరీ వినిపించాడని, అది తనకు బాగా నచ్చడంతో వెంటనే ఓకే చేశాడని తెలుస్తోంది. ఇది ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందనుందని టాక్. రవితేజ ఓ పూర్తిస్థాయి కామెడీ సినిమా చేసి చాలాకాలం అవుతోంది. నిజానికి రవితేజ డైలాగ్ డెలివరీతో కామెడీ చేయగలరు. ఇక రవితేజ టైమింగ్ కి అనుదీప్ డైలాగ్స్ తోడైతే తప్పకుండా మంచి కామెడీ సినిమా అవుతుందని అభిప్రాయ పడుతున్నారు ప్రేక్షకులు. ప్రస్తుతం రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’, ‘ఈగల్’ సినిమా షూటింగ్‌ల్లో బిజీగా ఉన్నాడు. ఇటీవలే ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసిన టైగర్ నాగేశ్వరరావు మీద భారీ అంచనాలే ఉన్నాయి