T20 World Cup: అందుకే రోహిత్ శర్మను ఎంపికచేసారా?
T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసంక్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది వెస్టిండీస్-అమెరికా జట్ల వేదికగా జరగనున్న ఈ మెగా టోర్నీలో టీమిండియాకు ఎవరు సారథ్యం వహిస్తారనే విషయంపై BCCI అధ్యక్షుడు జై షా (Jay Shah) స్పష్టతనిచ్చారు.
ఈ ఏడాది వెస్టిండీస్, అమెరికా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మొత్తంగా 20 జట్లు పాల్గొననున్న ఈ మెగా టోర్నీ జూన్ 1వ తేదీ నుంచి జూన్ 29వ తేదీ వరకు జరుగనున్నది. ఇప్పటికే ICC పూర్తి స్థాయిలో షెడ్యూల్ కూడా ప్రకటించేసింది. సుమారు పదకొండేళ్లుగా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న టీమిండియాకు ఈ టీ20 ప్రపంచకప్ చాలా కీలకం కానున్నది.
గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్ దూకుడు ప్రదర్శనిచ్చిన భారత్ కు ఫైనల్లో ఎదురుదెబ్బ తగిలింది. కనీసం అండర్ 19 కప్ అయినా వస్తుందని ఎదురుచూసిన ఫ్యాన్స్ కూడా నిరాశే ఎదురైంది. దీంతో ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ ఎలాగైనా కైవసం చేసుకోవాలన్న కసితో టీమిండియా వేచి ఉంది. కానీ.. టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు ఎవరు సారథ్యం వహిస్తారనే విషయంలో చాలా రోజులుగా ఉత్కంఠ నెలకొంది. అయితే, బీసీసీఐ అధ్యక్షుడు జై షా ఈ విషయంలో స్పష్టతనిచ్చేశారు. టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు కెప్టెన్ ఎవరో వెల్లడించారు. (Rohit Sharma)
వాస్తవానికి 2022 టీ20 ప్రపంచకప్ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ.. టీ20 ఫార్మాట్ కు దూరమయ్యారు. కేవలం వన్డేలు,టెస్టులకే పరిమితమయ్యారు రోహిత్.. ఈ తరుణంలో జట్టు నాయకత్వం బాధ్యతలు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కు అప్పగించారు. అయితే.. ఈ ఏడాది జనవరిలో అఫ్గానిస్థాన్‌తో సిరీస్‌తో రోహిత్ శర్మ మళ్లీ భారత్ టీ20 జట్టులోకి వచ్చాడు. దీంతో టీ20 ప్రపంచకప్‌లో భారత కెప్టెన్ అంశంలో సందిగ్గత నెలకొంది.
2024 టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు రోహిత్ శర్మనే కెప్టెన్‌గా ఉంటాడని జై షా స్పష్టం చేశారు. అతడి సారథ్యంలో ప్రపంచకప్ టైటిల్‌ను భారత్ కైవసం చేసుకుంటుందని తనకు పూర్తి నమ్మకం ఉందని రాజ్‌కోట్‌లో నేడు జరిగిన ఓ ఈవెంట్లో చెప్పారు.
“ప్రపంచకప్ గురించి నేను ఏదైనా చెబుతానని అందరూ ఎదురుచూస్తున్నారు. 2023 వన్డే ప్రపంచకప్‌లో 10 మ్యాచ్‌లు గెలిచినా మనం టైటిల్ దక్కించుకోలేకపోయాం. అయితే హృదయాలను మాత్రం గెలిచాం. అందరికీ నేను ఓ ప్రామిస్ చేయాలనుకుంటున్నా. రోహిత్ శర్మ కెప్టెన్సీలో 2024లో మనం భారత్ జెండాను రెపరెపలాడిస్తాం” అని జై షా అన్నారు. దీంతో 2024 టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ అని జై షా చెప్పేశారు. మరోవైపు, గాయం నుంచి హార్దిక్ పాండ్యా పూర్తిగా కోలుకున్నాడు. వరల్డ్ కప్‌లో అతడు వైస్ కెప్టెన్‌గా ఉండనున్నాడు.
రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియానికి BCCI మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ నిరంజన్ షా పేరు పెట్టింది. ఈ స్టేడియంలోనే భారత్, ఇంగ్లండ్ మధ్య ఫిబ్రవరి 15 న మూడో టెస్టు జరగనుంది. ఈ కార్యక్రమానికి భారత కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్‌తో పాటు మరికొందరు ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది పాల్గొన్నారు. టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా హాజరయ్యారు. సౌరాష్ట్రకు చెందిన భారత క్రికెటర్లు చతేశ్వర్ పుజార, రవీంద్ర జడేజా, జయదేవ్ ఉనాద్కత్‌ను ఈ సందర్భంగా బీసీసీఐ సత్కరించింది.