“పవన్ అందుకే గెంటేసినట్లున్నాడు”
సినీ నటి, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్‌కి సోషల్ మీడియాలో వేధింపులు ఎక్కువైపోతున్నాయి. నిన్న కుమారుడు అకీరా బర్త్‌డే సందర్భంగా పోస్ట్ చేసిన వీడియోకు కొందరు పవన్ అభిమానులు స్పందిస్తూ.. మా పవన్ అన్నయ్య కొడుకు వీడియోలు పోస్ట్ చేస్తుండండి అంటూ కామెంట్లు పెట్టారు. దీనికి రేణూ సరైన పద్ధతిలో సమాధానమిస్తూ తన పోస్ట్‌లకు అసలు కామెంట్లు చేయకండి అని వేడుకున్నారు. అయినప్పటికీ రేణూకు వేధింపులు ఆగడంలేదు. తాజాగా ఓ అభిమాని రేణూని ఉద్దేశిస్తూ అసభ్యంగా కామెంట్ పెట్టాడు. “మా అన్న కొడుకుని చూపించండి అంటే నెగిటివ్ కామెంటా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా దీనిని అన్‌ఫాలో చేయండి. లైక్స్, కామెంట్స్ అసలు చేయకండి. 2024 ఎలక్షన్ల నేపథ్యంలో ఈ చిల్లరది మళ్లీ కొత్త స్టంట్లు మొదలుపెట్టింది. అకీరాను కన్నతండ్రి పవన్ అయినప్పుడు అన్న కొడుకు అంటే తప్పేముంది? పవన్ దీనిని వదిలేసి మంచి పని చేసాడు. ఇలాంటి చిల్లర వేషాలు ఇంట్లో వేసింది కాబట్టే బయటికి గెంటేసినట్లున్నాడు” అని అసభ్యకరంగా కామెంట్ చేసాడు. దీనిని రేణూ తన స్టోరీలో పోస్ట్ చేస్తూ.. “మీరు ఒక మంచి కుటుంబం నుంచి వచ్చినప్పుడు ఇలాంటి కామెంట్లు ఎలా చేయగలుగుతున్నారు? ఇది సరైనదో కాదో మీ అమ్మను అడగండి” అని స్పందించారు.
అసలు ఏం జరిగిందంటే.. నిన్న అకీరా నందన్ 19వ బర్త్‌డే కావడంతో రేణూ.. తన కుమారుడి ఒడిలో కూర్చోపెట్టుకున్న వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసారు. అయితే పవన్ అభిమాని అయిన ఓ నెటిజన్ రేణూకు ఇన్‌స్టా కామెంట్ సెక్షన్‌లో ఓ మెసేజ్ పెట్టాడు. “మేడం.. ఇది చాలా అన్యాయం. అకీరాను ఒక్కసారైనా చూపించండి. మా అన్నయ్య కొడుకుని చూడాలని ఉంటుంది. అప్పుడప్పుడు మీరు అకీరా వీడియోలను కూడా షేర్ చేస్తుండండి” అని కామెంట్ చేసాడు. ఇందుకు రేణూ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. “అన్నయ్య కొడుకా? అకీరా నా కొడుకు. మీరు ఒక తల్లికి పుట్టలేదా? మీరు పవన్‌కి వీరాభిమానులు అన్న విషయం నాకు తెలుసు. కానీ మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడండి. ఇలాంటివి నేను మామూలుగా పట్టించుకోను కానీ కొన్నిసార్లు మీరు హద్దులు దాటుతుంటే చూస్తూ ఊరుకోలేను” అని రిప్లై ఇచ్చారు.
ఈ సంభాషణ ఇంతటితో ఆగలేదు. మరో అభిమాని మధ్యలో కలగజేసుకుని.. “మన దేశంలో తల్లిదండ్రుల పేర్లు చెప్పమంటే ముందు తండ్రి పేరే చెప్తారు. అది మన సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని మర్చిపోయి ఇలా కోపం తెచ్చుకోకండి” అని ఉచిత సలహా ఇచ్చాడు. దీనికి కూడా రేణూ రిప్లై ఇచ్చారు. “ఓ తల్లిని తక్కువ చేసి మాట్లాడటం అనేది మన సంప్రదాయమా? మన దేశంలో తల్లిని దైవంతో సమానంగా చూస్తారు. మీకు తెలీకపోతే మీ అమ్మని, ఆంటీలను అడుగు” అని గట్టిగా సమాధానం ఇచ్చారు.
మధ్యలో మరో అభిమాని కలగజేసుకుని. “మరి ఎందుకు అప్పుడప్పుడు మీరు అకీరాను పవన్ ఇంటికి పంపుతుంటారు” అని అడిగాడు. ఇలాంటి అర్థంలేని ప్రశ్నలతో విసిగిపోయిన రేణూ అందరినీ హెచ్చరిస్తూ ఓ పోస్ట్ పెట్టారు. “11 ఏళ్లుగా నేను ఈ నరకాన్ని అనుభవిస్తున్నాను. ఇంకా నోరుమూసుకుని కూర్చోవాలంటే నా వల్ల కాదు. దయచేసి నా పోస్ట్‌లకు మీరు కామెంట్లు పెట్టకండి. నేను మీ పోస్ట్‌లపై కామెంట్లు పెట్టడంలేదు కదా.. దయచేసి మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వండి” అంటూ ఆసహనం వ్యక్తం చేసారు రేణూ.
అయితే “మా అన్న కొడుకుని ఒకసారి చూపించండి” అని అడగడంలో తప్పేముందని, అనవసరంగా లేని పోనివి ఊహించేసుకుని తిట్టించుకునే బదులు కామెంట్లను పట్టించుకోకపోవడం మంచిదని పలువురు నెటిజన్లు రేణూకు పాఠాలు చెబుతున్నారు. బహుశా ఇలా చేయడం తప్పు అని పవన్ ఒక్కమాట చెబితే మున్ముందు ఇలాంటివి జరగకుండా ఉంటాయేమో..!