Valentine’s Day: ఈరోజు సెక్స్ చేయకూడదట.. ఎందుకో తెలుసా?
Valentine’s Day: వ్యాలెంటైన్స్ డే అనగానే ప్రేమికులకు ఏదో తెలీని కొత్త ఉత్సాహం వస్తుంది. ఏడాది మొత్తంలో ప్రేమ ఒక రకంగా ఉంటే.. ఈ ఫిబ్రవరి 14న మాత్రం మరో రకంగా ఉంటుంది. ఇంకొందరైతే జస్ట్ క్యాజువల్ డేటింగ్ పేరుతో వ్యాలెంటైన్స్ డేని శృంగార దినోత్సవంగా మార్చేస్తుంటారు. అంటే జస్ట్ ఫిజికల్ ఎక్స్పీరియన్స్ కోసం కలుస్తుంటారు. ఒకప్పుడు వ్యాలెంటైన్స్ డేకి ఓ విలువ ఉండేది. కానీ ఈరోజుల్లో అలా కాదు. ఈరోజుల్లో నిజమైన ప్రేమ అనేది బూతద్దం పెట్టి వెతికినా అంత త్వరగా కనిపించని పరిస్థితులు. ఇక ఈరోజున ఎంతో మంది జంటలు శారీరకంగా కలవాలని అనుకుంటారు. అయితే వ్యాలెంటైన్స్ డే రోజున అసలు శారీరకంగా కలవకూడదట. ఎందుకో తెలుసుకుందాం. (Valentine’s Day)
వ్యాలెంటైన్స్ డే రోజున జంటలు శారీరకంగా కలవకూడదని ఎవరో కాదు ఓ సెక్స్ థెరపిస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇందుకు కారణం కూడా ఉంది. రోజూ శారీరకంగా కలుస్తున్నా కూడా వ్యాలెంటైన్స్ డే రోజున శృంగారం అనేది ఇంకా స్పెషల్‌గా ఉంటుంది. అదే సమయంలో కాస్త ఒత్తిడికి కూడా లోనవుతుంటారట. అందుకే వ్యాలెంటైన్స్ డే రోజున సెక్స్ ఫాస్టింగ్ చేయాలని ఆ థెరపిస్ట్ సూచించారు. ఇలా చేయడం వల్ల ఒత్తిడి దూరమై మనసు తేలిక పడుతుందట. వ్యాలెంటైన్స్ డే (Valentine’s Day) అనే హైప్ ఇప్పటికే చాలా ఎక్కువ అయిపోయింది. ఈ హైప్‌ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పువ్వులు, కానుకలు, చాక్లెట్లు ఇస్తేనే వ్యాలెంటైన్స్ డే అని.. ఇవేమీ చేయకపోతే అసలు ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నది ప్రేమే కాదని లేని పోని కహానీలు చెప్తుంటారు. వీటి ఉచ్చులో అసలు పడకండి. జనవరి 14 ఎలాగో ఫిబ్రవరి 14 కూడా అలానే. దీనిని ఓ స్పెషల్ డేగా చూడాల్సిన అవసరం కూడా లేదు.
ఇంతకీ ఆ సెక్స్ థెరపిస్ట్ వ్యాలెంటైన్స్ డే రోజున ఎందుకు సెక్స్ వద్దన్నారంటే.. ఈ ఒక్క రోజు సెక్స్ కాకుండా ఇతర రకాలుగా ప్రేమించుకునేలా ఉండాలని. ప్రేమ అంటే సెక్స్ ఒక్కటేనా? సరదాగా ఒక రోజంతా కలిసి గడిపినా.. ఎలాంటి ఫిజికల్ టచ్ లేకుండా ఎమోషనల్ టచ్ ఉన్నా కూడా అది ప్రేమే కదా..! ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి. మీకు వ్యాలెంటైన్స్ డే రోజు స్పెషల్‌గా గుర్తుండిపోవడానికి మీ పార్ట్నర్తో సెక్స్ చేయాలనుకుంటున్నారనుకోండి.. ఇందుకు మీ పార్ట్నర్ సిద్ధంగా లేకపోతే మీరు ఫీల్ అవ్వడం.. ముందు వెనక ఆలోచించకుండా బ్రేకప్ చెప్పేయడం వంటివి అస్సలు చేయకండి. వారు ఎందుకు సిద్ధంగా లేరో తెలుసుకోండి. ఈరోజు కాకపోతే రేపు.. లేదా ఎల్లుండి. ఇద్దరు ప్రేమికుల మధ్య ఉండాల్సింది సెక్స్ ఒక్కటే కాదు కదా..!
అందుకే ఈ వ్యాలెంటైన్స్ డే రోజున కచ్చితంగా సెక్స్‌లో పాల్గొనాల్సిందే అనే అపోహ నుంచి బయటికి రండి. అందరూ ఇలాగే ఆలోచిస్తారని కాదు. కానీ ఇలా ఆలోచించేవారు ఈరోజుల్లో చాలా ఎక్కువైపోయారు. ఈరోజుల్లో ప్రేమించుకుని సెక్స్ చేయడం లేదు.. ముందు అన్నీ కానిచ్చేది ఆ తర్వాత వారు నచ్చితే అప్పుడు ఒకరికొకరు ఐలవ్యూ అని చెప్పుకుని కొన్నాళ్లు కలిసి తిరిగి బ్రేకప్ చెప్పేసుకుంటున్నారు. ఇలాంటి ఉచ్చులో మాత్రం పడకండి. ఎందుకంటే ప్రేమ అనేది ఒక మధురమైన అనుభూతి. ఈరోజుల్లో నిజమైన ప్రేమ దొరకడం చాలా అరుదు. ఈ విషయాలన్నీ గుర్తుంచుకుంటారని ఆశిస్తూ హ్యాపీ వ్యాలెంటైన్స్ డే.