RC15: రామ్​ చరణ్​ సినిమాలో విలన్​గా స్టార్​ హీరో!

ఆర్​ఆర్​ఆర్​ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్​ అయ్యారు మెగా పవర్​స్టార్ రామ్​ చరణ్​. ఈ సినిమా ప్రతిష్టాత్మక ఆస్కార్​ బరిలో నిలవడంతో చెర్రీకి బాలీవుడ్​, హాలీవుడ్​ నుంచీ అవకాశాలు వస్తున్నాయి. తాజాగా చెర్రీ నటిస్తున్న సినిమాలపై కూడా అందరి దృష్టి పడుతోంది. ప్రస్తుతం రామ్​ చరణ్​‌‌, స్టార్​ డైరెక్టర్​ శంకర్​ కాంబినేషన్లో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ​ RC15 వర్కింగ్​ టైటిల్​తో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమా గురించి తాజాగా ఓ వార్త హల్​చల్​ చేస్తుంది. అదేంటంటే.. ఈ సినిమాలో విలన్​ పాత్రలో కోలివుడ్​ స్టార్​ హీరో అజిత్​ నటించనున్నాడని టాక్​.

ప్రస్తుతం రూపొందుతున్న సినిమాలన్నీ ప్రాంతీయ సినిమాలుగా కాకుండా పాన్​ఇండియా సినిమాలుగా రూపొందుతున్నాయి. ఇంతకుముందు ఒక భాషకు చెందిన హీరోలతో అదే పరిశ్రమకు చెందినవారు పని చేసేవారు. ముఖ్యంగా హీరోలు, దర్శకులు వారి ప్రాంతీయ భాష చిత్రాలనే తెరకెక్కించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. వివిధ భాషలకు చెందిన హీరోలు, దర్శకులు, నటీనటులతో సినిమాలు రూపొందిస్తున్నారు. అలా తెరకెక్కిన సినిమాలే పాన్​ఇండియా సినిమాలుగా బాక్సాఫీస్​ వద్ద రికార్డులు సృష్టిస్తూ వందల కోట్ల కలెక్షన్లు కొల్లగొడుతున్నాయి.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తెరకెక్కిస్తున్న సినిమా RC15.ఈ సినిమాలో చెర్రీ సరసన కియారా అడ్వాణీ నటిస్తోంది. ఈ సినిమాకు ఏ టైటిల్ పెడతారా అని సౌత్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవలే ఈ చిత్రానికి టైటిల్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపించాయి. వాటిలో నాలుగు, ఐదు క్రేజీ టైటిల్స్ ను చిత్రబృందం అనుకున్నట్లుగా టాక్ నడిచింది.

అయితే వాటిలో RC15 4 టైటిల్స్ రిజిస్టర్ చేశారట. అందులో సేనాని, సేనాపతి, సీఈవో, సైనికుడు ఉన్నాయట. అంతకుముందు సర్కారోడు, సీఎం కామన్ మ్యాన్, సిటిజన్ వంటి పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. కానీ వీటన్నింటిలో ఫైనల్ గా సీఈవో (CEO) అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. చెర్రీ బర్త్ డే సందర్భంగా.. RC15 టైటిల్ పోస్టర్ ను మెగా పవర్ స్టార్, గ్లోబల్ హీరో రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న అనౌన్స్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్.

ఇక, RC15 సినిమాలో పవర్ ఫుల్ విలన్ పాత్రలో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్​ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తెగింపు చిత్రంతో హిట్ కొట్టిన తలా అజిత్ కుమార్​ను ఈ పాత్రకోసం శంకర్ ఒప్పించాడని అంటున్నారు. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోవడంతో అంతా వట్టి రూమరే అనే చర్చ కూడా నడుస్తోంది. అయితే హీరోగా సత్తా చాటిన అజిత్ తన విలనిజంతో ఫ్యాన్స్, సౌత్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయగలడనే భావన ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే ఇంతకుముందు కొన్ని చిత్రాల్లో నెగెటివ్ పాత్రలతో అదరగొట్టాడు. ఇప్పుడు ఆయన ఇందులో విలన్ గా నటిస్తే నిజంగా ఈ సినిమాకి ఎంతో ప్లస్​ అవుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది. అసలు విషయం తెలియాలంటే అఫీషియల్​ అనౌన్స్​మెంట్​ వచ్చేవరకూ ఆగాల్సిందే!