Safest Banks: సురక్షితమైన భారతీయ బ్యాంక్స్ ఇవే..!
Hyderabad: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(rbi).. భారతదేశంలోని సురక్షితమైన బ్యాంక్‌ల(safest banks) జాబితాను రిలీజ్ చేసింది. ఇటీవల అమెరికాకు చెందిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. దాంతో భారతీయుల్లోనూ బ్యాంకుల్లో తమ డబ్బు భద్రంగా ఉంటుందో లేదో అన్న భయం మొదలైంది. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ సేఫెస్ట్ ఇండియన్ బ్యాంక్స్ లిస్ట్ విడుదల చేసింది.
ఈ లిస్ట్‌లో ఒక ప్రభుత్వ రంగ బ్యాంక్, మరో రెండు ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి. SBI, HDFC, ICICI బ్యాంకులు సేఫెస్ట్ బ్యాంక్స్‌గా నిలిచాయి. అసలు సురక్షితమైన బ్యాంక్ అని ఎలా చెప్పగలుగుతారంటే.. ఆ బ్యాంక్‌ల CET1 అంటే కామన్ ఈక్విటీ టియర్ 1 అధికంగా ఉండాలి. అంటే.. దేశంలో ఆర్థిక నష్టాలు ఉన్నప్పటికీ ప్రజలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా చూడాలి. అందుకే బ్యాంకులు ప్రతి ఆర్థిక సంవత్సరానికి తమ వడ్డీ రేట్లకు తెగ పెంచేస్తుంటాయి. ఈ CET1 స్కోర్ బాగుంటే.. ఆటోమేటిక్‌గా ఆ బ్యాంక్ మన డబ్బు దాచుకోవడానికి సేఫ్ అని చెప్పవచ్చు.
ఈ మూడు బ్యాంక్‌లపై ఆర్‌బీఐ ప్రత్యేక నిఘా ఉంటుంది. పెద్ద మొత్తంలో లోన్లు ఇవ్వాల్సిన సందర్భంలో లేదా ఏదన్నా పెద్ద ప్రాజెక్ట్ టేకప్ చేయాలన్నా ఒకటి పది సార్లు ఆర్‌బీఐ ఆలోచించి పర్మిషన్ ఇస్తుంది. ఈ సేఫెస్ట్ బ్యాంక్ జాబితాను ఆర్‌బీఐ 2015 నుంచి రిలీజ్ చేస్తోంది. దేశ ఆర్థిక స్థితి బాగుండడానికి ఈ బ్యాంకుల అవసరం ఎంతో ఉందని ఆర్‌బీఐ అభిప్రాయపడుతోంది. ఆర్‌బీఐ ప్రతి సంవత్సరం తన లిస్ట్‌లో ఉన్న బ్యాంకులకు రేటింగ్ ఇస్తుంది. కానీ ఇప్పటివరకు భారతదేశంలో మూడే మూడు బ్యాంకులు సురక్షితంగా ఉన్నాయంటే ఆలోచించాల్సిన అంశమే.