ఒకే గదిలో రష్మిక, విజయ్.. ఫోటోలు వైరల్
రష్మిక మందన, విజయ్ దేవరకొండ డేటింగ్‌లో ఉన్నట్లు ఎప్పటినుంచో వార్తలు వెలువడుతున్నాయి. ఓసారి కలిసి మాల్దీవులకు వెళ్లినప్పటి ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే తామిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనని ఫ్రెండ్స్‌తో కలిసి ట్రిప్స్‌కు వెళితే అది డేటింగ్ ఎలా అవుతుందని రష్మిక ఇప్పటికే చాలా సార్లు స్పందించింది. ఈ విషయం గురించి ఇప్పటివరకు విజయ్ నోరువిప్పింది లేదు. అయితే నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఓ ట్వీట్ బాగా వైరల్ అవుతోంది. ఏప్రిల్ 5న రష్మిక తనకు బర్త్‌డే విషెస్ చెప్పినవారికి ధన్యవాదాలు చెబుతూ ట్విటర్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది. వీడియోలో తను ఏదో హోటల్ రూంలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సౌత్ డిజిటల్ మీడియా అనే సంస్థ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇందుకు కారణం.. రష్మిక ఉంటున్న ప్రదేశంలోని బ్యాక్‌గ్రౌండ్‌లోనే విజయ్ దేవరకొండ ఉన్నట్లు ఫొటోలు పోస్ట్ చేయడమే. అంతేకాదు.. రష్మిక, విజయ్ డేటింగ్‌లో ఉన్నారన్న మాట వాస్తవమేనని అదీకాకుండా విజయ్‌కు ఎంతో ఇష్టమైన ఉంగరం రష్మిక చేతికి ఉందని ఆ సంస్థ ట్వీట్ చేసింది. వీరిద్దరూ ఒకే ప్రదేశంలో ఒకే రూంలో ఉన్నారని త్వరలో వీరి నుంచి శుభవార్త రాబోతోందని పేర్కొంది. దీనిపై రష్మిక స్పందిస్తూ అయ్యో.. దీని గురించి ఎక్కువగా ఆలోచించకు బాబూ.. అని రిప్లై ఇచ్చింది. ఇప్పటికే రెండు సార్లు రష్మిక, విజయ్ ఒకే ప్రదేశంలో ఉన్నప్పటి ఫొటోలు వైరల్ అయ్యాయి. అయినా కూడా తామిద్దరం కేవలం ఫ్రెండ్స్ మాత్రమేనని రష్మిక అంటోంది.