బాలీవుడ్​ స్టార్స్​ని వెనక్కి నెట్టేసిన రామ్​ చరణ్​!

RRR సూపర్​ సక్సెస్​తో మెగాపవర్​ స్టార్​ రామ్​ చరణ్​, యంగ్​ టైగర్​ ఎన్టీఆర్ గ్లోబల్​ స్టార్స్​గా మారిపోయిన సంగతి తెలిసిందే. మన దేశంలోనూ ఉత్తరాది, దక్షిణాది తేడాలేకుండా అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్​లోనూ మంచి గుర్తింపు దక్కింది. ముఖ్యంగా రామ్​ చరణ్​ తుఫాన్​ సినిమా అప్పుడు విమర్శించిన నార్త్​ మీడియా చెర్రీ నటనను పొడుగుతూ కథనాలు రాసుకొచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు మన ఆర్​ఆర్​ఆర్​ వాళ్లకి ఏ రేంజ్​లో నచ్చిందో. ఏడాది నుంచీ ఎక్కడ చూసినా ఆర్​ఆర్​ఆర్​, నాటు నాటు, రామ్ చరణ్​, ఎన్టీఆర్​, రాజమౌళి పేర్లు వినిపిస్తున్నాయి. మార్చిలో జరిగిన అకాడమీ వేడుకల్లోనూ ఆర్​ఆర్​ఆర్​ ఆస్కార్ దక్కించుకోవడంతో ప్రపంచం మొత్తం తెలుగు ఖ్యాతి విస్తరించింది. ఇక, నార్త్​లో చెర్రీకి బాగా ఫ్యాన్​ ఫాలోయింగ్​ పెరిగింది. బాలీవుడ్ స్టార్స్ కంటే కూడా బాగా ఫేమస్​ అయ్యారు. అంతేకాదు చెర్రీ, తారక్​తో బాలీవుడ్​ సినిమాలు సినిమాలు తీసేందకు సన్నాహాలు కూడా చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ నేపథ్యంలో తాజాగా మరో రికార్డుతో మరోసారి బాలీవుడ్​ స్టార్స్​కి షాక్​ ఇచ్చారు మెగాపవర్​ స్టార్​ రామ్​ చరణ్​. ప్రముఖ సినీ వెబ్​సైట్​ ఇంటర్నెట్​ మూవీ డేటా బేస్​(IMDB) ప్రకటించిన టాప్​ టెన్​ జాబితాలో మొదటి స్థానం దక్కించుకుని తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు చెర్రీ.

IMDB ప్రతి వారం, ప్రతి నెల ఇండియాలో టాప్ స్టార్స్ జాబితాను విడుదల చేస్తుంది. ఫ్యాన్స్ ఓటింగ్, పాపులారిటీ, యాక్టివిటీలను బట్టి IMDB ఈ లిస్ట్ ని రిలీజ్ చేస్తుంది. గత కొన్నాళ్లుగా చరణ్, ఎన్టీఆర్ ఈ టాప్ 10 లిస్ట్ లో ఉంటూనే వస్తున్నారు. తాజాగా ఈ వారం రిలీజ్ చేసిన లిస్ట్ లో బాలీవుడ్ స్టార్స్ షారుఖ్, సల్మాన్ లను దాటి మరీ రామ్ చరణ్ మొదటి స్థానంలో నిలిచారు. ఈ లిస్ట్ లో రామ్ చరణ్ మొదటి ప్లేస్ లో నిలవగా బాలీవుడ్ భామ యామి గౌతమ్ సెకండ్ ప్లేస్ లో నిలిచింది. షారుఖ్ మూడవ, దీపికా పదుకొనే నాలుగు, సల్మాన్ అయిదు, ఎన్టీఆర్ ఆరు, ఐశ్వర్యరాయ్ ఏడు, రాశిఖన్నా ఎనిమిది, అమీర్ ఖాన్ తొమ్మిదవ స్థానంలో నిలవగా, సన్నీ కౌశల్ పదవ స్థానంలో నిలిచారు. దేశం మొత్తంలోని స్టార్స్​ ఆధారంగా తీసే ఈ జాబితాలో రామ్ చరణ్ మొదటి ప్లేస్ లో నిలవడంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక చెర్రీ తమిళ డైరెక్టర్​ శంకర్​ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్​ ఛేంజర్​ సినిమా షూటింగ్​తో బిజీగా ఉన్నారు. షూటింగ్​కి కాస్త గ్యాప్​ ఇచ్చి దుబాయ్​లో తన భార్య ఉపాసన సీమంతం వేడుకల్లో పాల్గొన్నారు. అంతేకాదు తాజాగా సల్మాన్ ఖాన్ కిసీకా భాయ్ కిసీకా జాన్ సినిమాలోని ఏంటమ్మా.. పాటలు సల్మాన్ ఖాన్, వెంకటేష్ లతో కలిసి లుంగీ డ్యాన్స్ అంటూ మాస్ స్టెప్పులతో అదరగొట్టి మరోసారి అభిమానులను సర్​ఫ్రైజ్​ చేశారు మెగా పవర్​ స్టార్.